తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెల, అంటే జనవరి  27 నుంచి లోకేష్ పాదయాత్రకు సన్నాహకాలు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు, దాదాపుగా ఏడాది పాటు ఈ పాదయత్ర సాగునుంది. అయితే ఈ పాదయాత్ర మొదలు కావటానికి, సరిగ్గా మరో నెల రోజులు గడువు ఉంది. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి, లోకేష్ పాదయాత్ర విశేషాలు అధికారికంగా చెప్పనున్నారు. లోకేష్ పాదయాత్ర పై ఒక ప్రోమో విడుదల చేసి, తేదీతో పాటు సమయం కూడా చెప్పనున్నారు. ఇక రోడ్ మ్యాప్ తో పాటుగా, పాదయాత్ర గురించి ఇతర వివరాలు కూడా టిడిపి నేతలు చెప్పనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఆనంద్‍బాబు, వంగలపూడి అనిత, షరీఫ్, ఇతర నేతలు పాల్గుంటారు. పాదయాత్రలో ఎక్కడా హంగామా లేకుండా, కేవలం ప్రజలను కలవటం, వారి సమస్యలు తెలుసుకోవటం పైనే, ఎక్కువ ఫోకస్ పెట్టాలని లోకేష్ ఆదేశాలు ఇవ్వటంతో, దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read