తొడ‌కొట్టిన స‌వాల్ విస‌ర‌డంలో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌ని మించిన వారు లేరు. సినిమాల్లో బాల‌య్య తొడ‌కొడితే సినిమా బాక్సాఫీసులు నిండిపోతాయి. ఇప్పుడు బాల‌య్య‌కి పోటీగా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వ‌చ్చారు. ఆయ‌న తొడ‌గొట్టి మ‌రీ చాలెంజులు చేస్తున్నారు. ఒక రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్. అత్యంత హుందాగా ఉండాల్సిన వ్య‌క్తి. అధికార‌, ప్ర‌తిప‌క్షం ఇష్టం ఉన్నా లేకున్నా గౌర‌వించాల్సిన పెద‌రాయుడు పోస్టు. ప్ర‌తిప‌క్షం ఏమైనా ఆరోప‌ణ‌లు చేస్తే స్పందించేందుకు ప్ర‌భుత్వంలో అధికార ప్ర‌తినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలున్నారు. ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌ల‌కు స్పీక‌ర్ స‌మాధానాలు ఇవ్వ‌డం దేశంలోనే మ‌న రాష్ట్రం నుంచే ఆన‌వాయితీని నెల‌కొల్పారు త‌మ్మినేని సీతారాం. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉంటూ స్పందించ‌కూడ‌ని అంశాల‌లో స్పందిస్తుండ‌డం స్పీక‌ర్ చైర్ కి అగౌర‌వం అయితే, బ‌జారు భాష ఆ కుర్చీకే అవ‌మానం అని రాజ‌కీయ విశ్లేషకుల మాట‌. లంజ‌త్వం అనే ప‌దం వాడ‌టం, ప్ర‌తిప‌క్ష‌నేత‌ని త‌రిమికొట్టాల‌ని పిలుపునివ్వ‌డం, తాజాగా తొడ కొట్ట‌డం చూస్తుంటే..ఆయ‌న స్పీక‌రేనా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read