వైకాపాలో అంతర్యుద్ధం జరుగుతోంద‌ని, ప్రజా తిరుగుబాటుతో ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంద‌ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.  రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓవైపు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒక వైపుగా పోరాటం జ‌రుగుతోంద‌న్నారు. ఈ పోరాటం అన్ స్టాపబుల్, తెలుగుదేశం విజయమూ అన్ స్టాపబుల్ అని ధీమా వ్య‌క్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దోపిడీ,అణ‌చివేత‌, ఫ్యాక్ష‌న్ దుర్గుణాలు అన్నీ క‌ల‌గ‌లిసిన జగన్మోహన్ రెడ్డి మెంటల్ మనస్థత్వం కలిగిన వ్యక్తి అని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇటువంటి ఉన్మాద పాల‌కుడి నుంచి రాష్ట్రాన్ని ర‌క్షించేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ప్ర‌జాసమ‌స్య‌ల‌పై స్వేచ్ఛగా పోరాడే వామపక్షాలు సైతం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌పు ధోర‌ణికి భ‌య‌ప‌డి పోరాడటం మానేశాయ‌న్నారు. ఇళ్లలో నుంచి ఇక ఎవ్వరూ బయటకురాకుండా భయపెట్టేశామనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏడాది ఏప్రిల్ లో బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్ర‌తిప‌క్షాల‌కు మద్దతు తెలపటంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని చంద్ర‌బాబు చెప్పారు. మహానాడులో ప్రజాచైతన్యం వెల్లువిరిసింద‌ని, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామ‌ని తెలిపారు. ప్రజల్లో కదలిక ప్రారంభం మాత్రమే, వైకాపా స‌ర్కారుకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, జాగ్రత్తగా ఉండాలని వైకాపా నేతల్ని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read