అంతా అనుమానిస్తున్న కోణ‌మే బ‌య‌ట‌ప‌డింది. చంద్ర‌బాబు బ‌హిరంగ‌స‌భ‌ల‌కు హాజ‌రు కాకుండా వైసీపీ పెద్ద‌లు కుట్ర ప‌న్నార‌నే అనుమానాలను కొడాలి నాని ప్ర‌క‌ట‌న బ‌ల‌ప‌డేలా చేసింది. గ‌త కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా, ఎంత మారుమూల ప్ర‌దేశంలోనైనా చంద్ర‌బాబు స‌భ ఉందంటే చాలు. జ‌నం పోటెత్తుతున్నారు. చంద్ర‌బాబు స‌భ‌కి వెళ్తే ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని బెదిరిస్తున్నారు. అయినా జ‌న‌సునామీని ఆప‌డం వైసీపీకి సాధ్యంకావ‌డంలేదు. చంద్ర‌బాబు ఈ రాష్ట్రాన్ని ర‌క్షించ‌గ‌ల‌డు అని జ‌నం ఫిక్స‌య్యాక‌, రోజురోజుకీ జ‌నాద‌ర‌ణ పెరుగుతూనే ఉంది. టిడిపికి ఒక స‌ర్పంచ్ కూడా లేని ప్రాంత‌లోనూ ప్ర‌జ‌లు ప్ర‌భంజ‌న‌మై వ‌స్తున్నారు. అనుమ‌తి నిరాక‌రించ‌డం, జ‌నాన్ని అడ్డుకోవ‌డం వంటి పాత‌కాల‌పు రాజ‌నాల సినిమా టైపు కుట్ర‌ల‌న్నీ అమ‌లుచేసి అలిసిపోయారు వైసీపీ నేత‌లు. ఈ సందర్భంలోనే కందుకూరులో మొద‌లై, గుంటూరులో వరుస ప్రమాదాలు జరిగాయి. అస‌లు ఏం జ‌రుగుతుంది అని టిడిపి ఆలోచించే లోపే వైసీపీ విష ప్రచారం మొదలు పెట్టింది. 40 ఏళ్లుగా లక్ష‌ల మంది స‌భ‌లలో పాల్గొన్న చంద్ర‌బాబు, టిడిపికి తెర‌వెనుక ఏదో జ‌రుగుతోంద‌ని డౌట్ వ‌చ్చేలోపే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

స‌భ ఏదైనా జ‌ర‌పాలి అంటే ప్ర‌భుత్వం అనుమ‌తి కావాలి. ప్ర‌భుత్వం అంటే జ‌గ‌న్, ఆయ‌న పోలీసులు. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు అనుమ‌తి ఇచ్చి భ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించింది పోలీసులే. పోలీసుల వైఫ‌ల్యం, స‌ర్కారు కుట్ర‌తోనే స‌భ‌లో విషాదాలు జ‌రిగాయ‌ని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌కు ఊతం ఇచ్చేలా ప్ర‌భుత్వం నుంచి మాజీ మంత్రి కొడాలి నాని ప్ర‌క‌ట‌న ఉంది. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌దని కొడాలి నాని డిమాండ్ చేస్తున్నారు. అంటే భ‌ద్ర‌త క‌ల్పించ‌నిదీ ప్ర‌భుత్వ‌మే, తొక్కిస‌లాట‌కి కార‌ణ‌మూ ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లోని పోలీసులే. వారి వైఫ‌ల్యాన్ని అంగీక‌రించ‌కుండా చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వొద్ద‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు, చివ‌రికి కొడాలి నాని డిమాండ్ చేస్తున్నారు. పోయిన ప్ర‌జ‌ల ప్రాణాల ప‌ట్ల వీరికి బాధ్య‌త‌లేదు. జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక‌త పెరిగిన నేప‌థ్యంలో జ‌నం చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వెళ్లకూడ‌ద‌నే ల‌క్ష్య‌మే వైసీపీలో క‌నిపిస్తోంది. అంటే కందుకూరు, గుంటూరు ఘ‌ట‌న‌ల వెనుక పెద్ద స్కెచ్చే ఉంద‌ని సామాన్యుల‌కు సైతం అర్థం అవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read