వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే, దాని వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంటుందని తేటతెల్లమైంది అంటున్నారు టిడిపి నేతలు . ఒక కుక్కని కొట్టాలంటే, ఆ కుక్కకి పిచ్చి పట్టిందని ప్రచారం చేయాలనే ఫ్యాక్షన్ స్ట్రాటజీ అమలు చేయడంలో వైసీపీ ఆరితేరిపోయిందని, బాబాయ్ వివేకానందరెడ్డిని చంపడానికి ముందు ఆయనని కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్కని చంపేశారని గుర్తు చేస్తున్నారు. ఇలా ఓ ఘోరం తలపెట్టడానికి ముందు చాలా నేరాలకు పాల్పడతారు. చంద్రబాబు బహిరంగసభలు, రోడ్‌షోలకి విశేషస్పందన లభిస్తుండడంతో స్ట్రాటజీ అమలు మొదలుపెట్టారని టిడిపి ఆరోపిస్తుంది. కందుకూరు, గుంటూరు సభలలో అమలు చేశారని, అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నారని, ఈ సంఘటనలను సాకుగా చూపుతూ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారనేది టిడిపి చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలు జరగకుండా అడ్డుకోవడానికే ఈ నిర్ణయం అని అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుందో ఆ సంఘటనలు తరువాత మంత్రులు, మాజీ మంత్రుల నోట వెంట పలికించింది. అనంతరం జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని నిబంధన విధించారు. కందుకూరు, గుంటూరు సభలు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే జరిగాయి. భద్రతాచర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంతో ఇక్కడ తొక్కిసలాటలు జరిగాయో, జరిపించారో అనే అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జనసంద్రాన్ని అడ్డుకునే మార్గాలన్నీ విఫలం కావడంతో కందుకూరు, గుంటూరు ఘటనలు సాకుగా చూపి ఆయన సభలు జరపకుండా ఉండేందుకే ఈ నిషేధం అమలులోకి తెచ్చారని టిడిపి ఆరోపణ
ఆ ఆదేశాలతోనే కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల వెనుక ఉన్నది ఎవరో తేలిపోయింది అంటున్న టిడిపి...
Advertisements