తెలుగుదేశం పార్టీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఎక్కడకి వెళ్ళినా, ఆ సభలకు జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, దక్షిణ కోస్తా అయినా, ఎటు వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సభలకు, ఈ ట్రెండ్ గతంలో లేదు. ఇప్పుడు మాత్రం, ఎందుకు ప్రజలు ఇంతలా ఆదరిస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న విశ్లేషణ. చంద్రబాబుని 40 ఏళ్ళకు పైగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి ఎప్పుడూ లేనిది, ఇప్పుడు ఇలా ఎందుకు వస్తున్నారు ? చంద్రబాబుకి పొలిటికల్ ఇమేజ్ తప్ప గ్లామర్ లేదు. మంచి వక్త కూడా కాదు. కానీ, ప్రజలు ఇప్పుడు కొత్తగా ఇంతలా ఆదరిస్తున్నారు అంటే, తాము తప్పు చేసాం అని భావిస్తున్నారా ? జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసం ఇప్పుడిప్పుడే ప్రజలు అర్ధం చేసుకుంటున్నారా ? ఈ విధ్వంసం నుంచి బయట పడేసిది చంద్రబాబు మాత్రమే అనే అంచనాకు వచ్చారా ? అందుకేనా చంద్రబాబు సభలకు ఈ జన ప్రభంజనం ? నిజానికి ప్రజలు గత 3.5 ఏళ్ళ నుంచి జగన్ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా రెండేళ్ళు పాటు రావటం, ఆ తరువాత ప్రతిపక్షం కూడా ప్రజల్లో లేకపోవటంతో, ప్రజలు తమ బాధలు చెప్పుకునే నాయకుడి కోసం ఎదురు చూసారు. సొంతగా ఉద్యమాలు చేసి, గొంతెత్తితే, ఎత్తి లోపల వేస్తున్న విధానం చూసి, ప్రజలు వెనకడుగు వేసిన సమయంలో, చంద్రబాబు బయటకు రావటం మొదలు పెట్టారు. చంద్రబాబు కూడా తన స్టైల్ మార్చి ప్రసంగాలు చేస్తున్నారు. కర్నూల్ లో మొదలైన ఈ ప్రజా ఉప్పెన, గోదారి నుంచి గుంటూరు వరకు చేరి, ఉత్తరాంధ్రని ఊపేసింది. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి పెట్టిన భయం ప్రజల్లో పోతుంది. పోలీసులు మీద భయం కూడా పోతుంది. చంద్రబాబు మళ్ళీ వచ్చేస్తున్నాడు అనే వాతావరణం ప్రజల్లో రావటంతో, చంద్రబాబు సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. అందుకే 50 ఏళ్ళుగా ప్రజల మధ్య ఉన్నా, చంద్రబాబు అంటే ఇప్పటికే ఆ క్రేజ్.
చంద్రబాబు విజన్, చంద్రబాబు సమర్ధత, చంద్రబాబు కష్టపడే తత్త్వం, ఇవన్నీ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. చేసిన తప్పు దిద్దుకుంటాం అనే అభిప్రాయంతో ఉన్నారు కనుకే, చంద్రబాబుకు ఆ ఆదరణ. గత 10 ఏళ్ళుగా చంద్రబాబు ఇమేజ్ పై, వైసీపీ చెప్పిన విషం కూడా, నెమ్మదిగా తొలగి పోతుంది. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇమేజ్ ప్రజల్లో రోజు రోజుకీ బల పడుతుంది. దీంతో ప్రజల్లో భరోసా పెరిగింది. మరో పక్క, చంద్రబాబు సభలకు వస్తున్న స్పందన చూసి, జగన్ కూడా అక్కడ ఇంచార్జ్ లను మార్చే పరిస్థితి వచ్చింది అంటే, చంద్రబాబు ఇంపాక్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికలకు మరో ఏడాది పైగా సమయం మిగిలి ఉండగానే, చంద్రబాబు సృష్టిస్తున్న ఈ సునామీ, వైసీపీని ఎలా ముంచేయ బోతుందో మరి. 2022లో చంద్రబాబు చూపించింది ట్రైలర్ మాత్రమే అని, 2023లో పిక్చర్ అభీ బాకీ హై అంటున్నారు టిడిపి నేతలు.