Sidebar

07
Wed, May

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన జనప్రభంజనంతో నిన్న అర్ధరరాత్రి వరకు సాగింది. చంద్రబాబు సభ పెట్టి వెళ్ళిపోతే ఇంత ఇంపాక్ట్ కూడా ఉండేది కాదు. జగన్ మోహన్ రెడ్డి కెలికి పెద్దది చేసి, రెచ్చగొట్టి, మీటింగ్ లేదని చెప్పటంతో, చంద్రబాబు పాదయాత్ర చేసారు. ప్రతి పల్లె తిరిగారు, ప్రతి ఒక్కరినీ కలిసారు. మీటింగ్ అయితే ప్రసంగం చెప్పి వెళ్ళిపోయే వారు. ఇప్పుడు అందరినీ కలుస్తూ ఉండటం, గ్రామాలకు గ్రామాలు రోడ్డు మీద ఉండటంతో, మీటింగ్ కంటే, ఎక్కువ ఇంపాక్ట్ నిన్న చంద్రబాబుకు వచ్చింది. దీంతో జగన్ తీచ్చిన జీవో, నిజంగా లోకేష్ అన్నట్టు నాలిక గీసుకోవటానికే ఉపయోగ పడింది. నిన్న చంద్రబాబు పెద్దూరు, బెండన కుప్పం, చెంగుబల్లలో పాదయాత్ర చేసారు. ఇంటింటికీ తిరిగారు. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచార రధం ఇవ్వమని పోలీసులని అడిగినా, ఇవ్వక పోవటంతో, చంద్రబాబు నడుచుకుంటూ వెళ్ళారు.నిన్న అర్ధరాత్రి వరకు చంద్రబాబు పర్యటన సాగింది. నేడు రెండో రోజు చంద్రబాబు కుప్పంలో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం, కుప్పం మండలాల క్లస్టర్ ఇన్‍ఛార్జ్ లతో చంద్రబాబు సమావేశం ఉంటుంది. నిన్న జరిగిన ఘటన పై, పోలీసులు ఎలాంటి కేసులు పెడతారో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read