ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేక ఏడుస్తూన్న రాష్ట్రం, కోట్ల రూపాయల యాడ్స్ ఇస్తోందంటూ కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్లో ఆవేదన వెలిబుచ్చారు. రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రిచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని రాష్ట్రం దేశంలోని ఒకే ఒక్క ఆంధ్రప్రదేశ్ యేనని, అలాగే రోజూ తన సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నదీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కావడంతో ఆ రాష్ట్రం ఏపీయేనని అందరూ ధ్రువీకరించుకున్నారు.  దేశంలో పలు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది నిజమేనని, అయితే ఒక రాష్ర్ట ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.''నేను ఆ రాష్ట్రం పేరు చెప్పదలుచుకోలేదు. కానీ, ఆ రాష్ట్రం తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. కొన్ని నెలలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించడం లేదనే వార్తలను చూస్తున్నాం. ఆ సర్కారు వద్ద వున్న డబ్బు అంతా యాడ్స్ ఇవ్వడానికి వెచ్చించి ఉండొచ్చు'' అని చాలా వ్యంగ్యంగా ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. ఏపీ ఆర్థిక అరాచకాలకు అండగా నిలుస్తూ వస్తున్న కేంద్రం, రాష్ట్రం పేరు చెప్పకుండానే ఏపీ దుస్థితిని మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చేలా చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read