ఏపీ పర్యాటకశాఖా మంత్రి ఆర్కే రోజా తన శాఖ పరిధిలో ఓ చెత్త రికార్డు సాధించారు. రోజూ ఏదో ఒక సభలో సెల్ఫీలు, డ్యాన్సులతో హడావిడి చేస్తున్న రోజా తన శాఖని దిగజార్చడంలో ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర విభజన తరువాత అన్నిరంగాల్లో ప్రగతిని జీరో నుంచి మెరుగైన స్థానాలకు తీసుకెళ్లడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేశారు. దీని ఫలితంగా నరేగా పనులలో మొదటి స్థానంలో వచ్చింది ఏపీ. పర్యాటకరంగంలోనూ 9వ ర్యాంకు సాధించింది. వైసీపీ సర్కారు వచ్చిన తరువాత అన్నిరంగాలూ తిరోగమనంలో పయనించాయి. అందులో ఒకటి పర్యాటక రంగం. సహజసిద్ధమైన ప్రకృతి వనరులు, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ప్రగతి సాధించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అయితే నిత్యమూ రాజకీయ కార్యకలాపాలలో మునిగి తేలుతున్న మంత్రులు తమ శాఖల పురోగతి గురించి పట్టించుకోవడం మానేశారు. నాలుగేళ్ల క్రితం 8వ స్థానంలో వున్న పర్యాటక రంగం 18వ ర్యాంకుకి దిగజారిపోయింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను నెలరోజుల నుంచి నిర్వహిస్తున్న పర్యాటక శాఖా మంత్రి రోజా గారు దీనిపై స్పందిస్తారేమో చూడాలి.
పర్యాటకంలో మన ర్యాంక్ ఎంతో తెలుసా ? రోజా గారు ఏమి చెప్తారో ?
Advertisements