జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏవర్గం ఆనందంగా లేదని, ఏఒక్కరి ముఖాల్లో సంతోషం కనిపించడంలేదని, మరీముఖ్యంగా మైనారిటీలపై ముఖ్యమంత్రి చూపుతున్న వివక్ష, కపటప్రేమ మాటల్లో వర్ణించలేనిదని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టంచేశారు. మాచర్లలో మారణహోమం జరిగినా, నిన్నటికి నిన్న నరసరావుపేటలో వైసీపీమూకలు షేక్ ఇబ్రహీంని కిరాతకంగా చంపినా, ఏమాత్రం పట్టనట్టు జగన్ రెడ్డి నిస్సిగ్గుగా పుట్టినరోజు వేడుక లు చేసుకుంటున్నాడని జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం...! “జగన్ పాలనలో 12శాతమున్న మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దళితులు, బీసీలు బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. మైనారిటీ కుటుంబాలంటే ముఖ్యమం త్రికి ఎందుకంత చిన్నచూపు? రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంటే, సిగ్గులేకుండా జగన్ రెడ్డి పుట్టినరోజులు చేసుకుంటున్నాడు. గోళీలాట ఆడినంత తేలిగ్గా వైసీపీవారు, హత్యలు, దోపిడీలు, లూఠీలు చేస్తుంటే, ముఖ్యమంత్రిలో చలనంలేదు. నరసరావుపేటలో షేక్ ఇబ్రహీం ని వైసీపీమూకలు కిరాతకంగా చంపితే, ముఖ్యమంత్రి మాట్లాడరా? కనీసం మృతుడి కుటుం బానికి సానుభూతిగా కూడా ఒక్కమాటచెప్పకుండా పుట్టినరోజు వేడుకల్లో మునిగిపోయా డు. దళితులు, మైనారిటీలు, బీసీలను ఉద్ధరిస్తానని నమ్మబలికి వారి ఓట్లు కొల్లగొట్టాడు.
మైనారిటీలకు మంచిచేసింది చంద్రబాబు అయితే.. వారిని ముంచేసింది జగన్ రెడ్డి. మైనారిటీలకు మంచిచేసింది చంద్రబాబునాయుడేనని ఘంటాపథంగా చెప్పగలం. వారి భవిష్యత్ గురించి ఆలోచించాడుకాబట్టే, టీడీపీఅధినేత, వారికోసం అనేకపథకాలు అమలుచేశాడు. రంజాన్ తోఫా, దుకాన్ – మకాన్, షాదీముబారక్, ఇమామ్ మౌజన్ లకు, మసీదుల మరమ్మతులకు నిధులు, ఖబరిస్తాన్ ల ప్రహరీలనిర్మాణం, ముస్లిం పిల్లలచదువుకు ఆర్థికసాయం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబే. పేదముస్లింలు మక్కాయాత్రకు వెళ్లడానికి ప్రభుత్వంతరుపున ఆర్థికసాయం చేశారు. నా నియోజకవర్గంలో రూ.15కోట్లతో చంద్రబాబుహయాంలోనే షాదీఖానా నిర్మించాను. ఉమ్మడిరాష్ట్రంలో హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టినఘనత చంద్రబాబుది. విభజనతర్వాత రాష్ట్రంలో, విజయవాడలో కడపలో హజ్ హౌస్ ల నిర్మాణాలు చేపట్టింది కూడా టీడీపీ అధినేతే. బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి నిధులు కేటాయించి, వెచ్చించింది తెలుగుదేశం ప్రభుత్వమే. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం హైదరాబాద్ లో మతకలహాలు రేపితే, చంద్రబాబుహాయాంలో హైదరాబాద్ ఐటీ హబ్ గా విరాజిల్లి, ప్రపంచపటంలో నిలిచింది.
మైనారిటీలకు ఒకమంత్రిపదవిచ్చి, ఆవర్గం మొత్తాన్ని నిలువునా ముంచేసిన జగన్ రెడ్డి, వారిని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి మూడున్నరేళ్లలో వైసీపీప్రభుత్వం ఎంతఖర్చుపెట్టిందో చెప్పగలడా? గొప్పవ్యక్తి, నిరాడంబరుడు, అందరితో స్నేహంగా ఉండే షరీఫ్ గారిని నిండుసభలో మంత్రులు దూషిస్తే, ముఖ్యమంత్రి నోరెత్తలేదు. అదేనా మైనారిటీలపై జగన్ రెడ్డికి ఉన్న ప్రేమ, అభిమానం? అబ్దుల్ సలాం, అబ్దుల్ సత్తార్ ల కుటుంబాలు అన్యాయంగా బలైపోయింది ఈ ప్రభుత్వంలోకాదా? చంద్రబాబు పరిపాలనా దక్షుడు అయితే, జగన్ రెడ్డి విద్వేష, వినాశకుడు. మూడున్నరేళ్లనుంచి కూల్చివేతలు, దోపిడీలు, ప్రశ్నించినవారిని చావబాదడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసింది శూన్యం. ప్రజలకు మంచిచేస్తే పరదాల మాటున ఎందుకు దాక్కుంటున్నాడు? వివేకాకూతురు, సొంతచెల్లి సునీత తనతండ్రి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయమని కోరడం జగన్ రెడ్డికి అవమానం కాదా? జగన్ డైరెక్షన్లో పనిచేస్తున్న పోలీస్ శాఖపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. కొందరు పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తునారనే చెప్పాలి. ఉపాధ్యాయులు ఇప్పటికే జగన్ రెడ్డిపై తిరుగుబాటు మొదలెట్టారు. ఇన్నాళ్లు దోచుకుందిచాలు.. ఇకనుంచి జాగ్రత్తపడండి అని జగన్, తనపార్టీ వారికి చెప్పడం సిగ్గుచేటు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు మూడేళ్లుగా ముఖ్యమంత్రి దోచుకోవడమే సరిపోయింది... మేం ఏం తిన్నామని బహిరంగంగానే అంటున్నారు? పాదయాత్ర సమయంలో కేంద్రం మెడలువంచి రాష్ట్ర్రానికి అన్నీతెస్తానన్నాడు.
పోలవరం, స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్, ప్రత్యేకహోదాపై ప్రగల్భాలు పలికాడు. ప్రజలకు మంచిచేస్తే, పోలీసులు, పరదాల మాటున ముఖ్యమంత్రి ఎందుకు దాక్కుంటున్నాడు? రాష్ట్రానికి, ప్రజలకు జగన్ రెడ్డి ఏం మంచి చేశాడని మరలా ఈ ప్రభుత్వానికి ఓట్లేస్తారు? అప్పుల్లో, రైతుఆత్మహత్యల్లో, అత్యాచారాల్లో రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపినందుకు జగన్ రెడ్డికి మళ్లీ ఓట్లేయాలా? శాంతిభద్రతల నిర్వహణలో కూడా రాష్ట్రం అట్టడుగునే ఉండటం సిగ్గుచేటు. అధికారపార్టీ వారే జగన్ రెడ్డికి ఓటేసేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. గడపగడపకు వెళ్తున్న వైసీపీనేతలకు ప్రజలనుంచి తిట్లే దీవెనలుగా లభిస్తున్నాయి. అధికారంలోకి రాకముందు అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, అవ్వాతాత అన్న జగన్, ఇప్పుడెందుకు తలెత్తుకొని తనబంధువుల మధ్యకు వెళ్లలేకపోతున్నాడు? భవిష్యత్ లో ముస్లింలంతా ఐక్యంగా ఒక్కమాటపై నిలిచి, మనభవిష్యత్ బాగుకోసం శ్రమించే చంద్రబాబుగారికే ఓటు వేయాలి” అని జలీల్ ఖాన్ విజ్ఞప్తిచేశారు.