నిన్న మాచర్లలో వైసీపీ చేసిన విధ్వంసంతో, నేడు టిడిపి  చలో మాచర్లకు పిలుపుచ్చింది. ఈ రోజు మాచర్ల వెళ్లి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేయలని ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్నే డీఐజీకి ఫోన్‍లో చంద్రబాబు  నిరసన తెలియజేసారు. మాచర్ల ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ కూడా రాసారు. ఈ మంటలు ప్రభుత్వాన్ని దహించడం ఖాయమంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇక మాచర్ల ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో టీడీపీ ఉంది. ఈ రోజు మాచర్ల పర్యటనకు టీడీపీ నేతలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు.  టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చారు. మాజీమంత్రి నక్కా ఆనంద్‍బాబు, టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులు పహారా పెట్టారు. టీడీపీ నేతలు పల్నాడు వెళ్తారనే సమాచారంతో ముందస్తు ఆంక్షలు విధిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read