మండల కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణలన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయని, ఏపీఈఆర్సీడ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ విచారణకే ఎందుకు పరిమితం అవుతుందో ప్రజలకు తెలియజేయాలని ఏపీఈఆర్సీడ ఛైర్మన్ సి.వి.నాగార్జునరెడ్డికి ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. ఏఆర్ఆ్ర్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ పేరుతో రహస్య విచారణల వెనుక ఆంతర్యమేంటని లేఖలో ప్రశ్నించారు. విచారణ జరపకపోవటం వినియోగదారుల హక్కులు కాలరాయడమేనన్నారు. గతంలో ఏపీఈఆర్సీప విచారణ బహిరంగంగా జరిగేదని, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్కుే తరలివచ్చాయని, ఏపీఈఆర్సీప కార్యాలయం మాత్రం హైదరాబాద్కేు ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. ఏపీఈఆర్సీవ కార్యాలయాన్ని ఏపీకి తరలించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రూ.6,165 కోట్ల ట్రూ అప్ భారాన్ని డిస్కంలు ప్రతిపాదించాయని, ప్రజాసంఘాల ఆందోళనతో రూ.2,910 కోట్లు వసూలుకు అనుమతివ్వడాన్ని ప్రశ్నించారు. ట్రూఅప్ భారాన్ని డిస్కంలు ఈ ఏడాది ఆగష్టు నుంచే వసూలు చేయడం మొదలుపెట్టాయని లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రజలపై భారం మోపడమేనన్నారు. విద్యుత్ సంస్థల సామర్ధ్యం పెంచుకోకుండా ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ సంస్థల బకాయిలు వసూలు చేసుకోకుండా వినియోగదారులపై భారాలు మోపడాన్ని ఏపీఈఆర్సీథ అనుమతించరాదని లేఖలో పయ్యావుల కేశవ్ కోరారు. ఇక ఇది పక్కన పెడితే, ఇప్పటికే కరెంటు చార్జీల బదుడే బాదుడుతో, ప్రజల పై భారం పడింది. ఇప్పటికే ఏడు సార్లు కరెంటు చర్జాలు పెంచి, ప్రజల నడ్డి విరిచేసారు. ఇప్పుడు మరోసారి కరెంటు చార్జీలు పెంచుతున్నారని తెలియటంతో, ప్రజలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. మరోసారి కరెంటు చర్జీలు పెంచితే, తాము పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని, ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమం చేస్తామని చెప్తున్నారు.