టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై దా-డు-ల-కు కుట్రలు జరుగుతున్నాయా? ఆయనకి ప్రాణహాని తలపెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారా? జరుగుతున్న వరస సంఘటనలతో కేంద్ర నిఘా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా బహిరంగ సభలో టిడిపి జాతీాయ అధ్యక్షుడు చంద్రబాబు లక్ష్యంగా రాయితో దా-డి చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు లైట్ తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బస్సుపై చెప్పులతో దా-డి చేశారు. దీనిపై నాటి డిజిపి భావప్రకటన స్వేచ్ఛ అంటూ కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన గూండాలతో దా-డికి దిగారు. ఇదేమో చంద్రబాబుకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారని జోగి రమేష్ పై కేసు కూడా పెట్టలేదు. నందిగామ ప్రాంతానికి చంద్రబాబు పర్యటనకి వెళ్లారు. అక్కడా పూలు మాటున రాళ్లు విసిరారు. విసిరిన వైసీపీ కార్యకర్తల్ని సాక్ష్యాలతో సహా టిడిపి పట్టి పోలీసులకు పంపితే, వారిపైనా కేసు లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుపై దా-డులకు పదేపదే పాల్పడేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, కేసులు నమోదు చేయకుండా వైసీపీ కనుసన్నల్లో పనిచేసే పోలీసులు నీరుగారుస్తుండడంతో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై కేంద్ర నిఘా వర్గాల ఆందోళన వ్యక్తం చేశాయి. భద్రత పెంచాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. చంద్రబాబు పర్యటనలకలు పోటెత్తుతున్న జన ప్రభంజనం మాటున దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయి. కేంద్రం నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ఎన్ఎస్‌జీ టీమ్ అప్రమత్తమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎన్ఎస్‌జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్, ఎన్ఎస్‌జీ సిబ్బంది మరోసారి వచ్చి పరిసరాాలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను ఎన్ఎస్‌జీ బృందం పరిశీలించింది. చంద్రబాబు ప్రచార సమయంలో రాత్రిపూట బస చేసే బస్సును ఎన్ఎస్‌జీ టీమ్ అణువణువూ చెక్ చేసింది. ప్రచార రథంపై 6 అడుగుల గ్లాస్ ఫ్రూఫ్ ఏర్పాటు చేయాలని పార్టీ సిబ్బందికి ఎన్ఎస్‌జీ సూచించింది. అనంతరం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎన్ఎస్‌జీ పరిశీలించింది.