వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కాలు జారారు. తన డ్రైవర్ అత్యంత కిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై ఇటీవలే విడుదలయ్యారు. ఆయనేదో స్వాతంత్య్రపోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చినట్టు వైసీపీ ఊరేగింపులతో స్వాగతం పలికింది. దీనిపై నేషనల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దళిత యువకుడిని అధికార వైసీపీ ఎమ్మెల్సీ చంపేస్తే, ఆయనపై కనీసం చర్యలు తీసుకోని వైసీపీ అధిష్టానం... బెయిల్ పై విడుదలయ్యేందుకు వీలుగా చార్జిషీటు దాఖలు చేయకుండా ఆలస్యం చేసింది. అనంతబాబుని కాపాడేందుకు సర్కారు చేసిన చర్యలన్నీ ప్రజలకి అర్థమైపోయాయి. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన హంతక ఎమ్మెల్సీ అనంతబాబుని వైసీపీ శ్రేణులు, నేతలు భారీ ర్యాలీలతో ఊరేగింపులు నిర్వహించి తీసుకెళ్లడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో డ్రామానో, నిజంగా జరిగిందో తెలియదు కానీ బాత్రూంలో ఎమ్మెల్సీ కాలుజారి పడ్డారట. ఆయనకి చెయ్యి విరిగిపోయిందట. ఆపరేషన్ అవ్వడం డిశ్చార్జి కావడమూ అయ్యిందట. ఇదేదో మరో ఎత్తుగడలా వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాలు జారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. ఫ్రాక్చర్ కావడం, ప్రైవేటు హాస్పిటల్ ట్రీట్మెంట్ రహస్యంగా ఎందుకు ఉంచారు?
Advertisements