ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నందుకు సినిమా టీముని అభినందిస్తూ ఏపీ సీఎం జగన్ రెడ్డి చేసిన ట్వీట్ పై ఫేమస్ సింగర్ అద్నాన్ సమీ ఘూటు రిప్లయి ఇచ్చారు. ప్రపంచప్రఖ్యాత అవార్డు తెలుగు చిత్రానికి దక్కడం తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీటుని అద్నాన్ సమీ తప్పు పట్టారు. మనమందరం భారతీయులమని ఒక ప్రాంతాన్ని మిగిలిన దేశం నుంచి విడదీయవద్దని జగన్ విద్వేషం విడనాడాలని నర్మగర్భంగా హెచ్చరిస్తూ ట్వీటు చేశారు. జగన్ వేర్పాటువాద వైఖరిని అనుసరిస్తున్నారన్నారని సమీ మండిపడ్డారు. అక్కడ ఎగిరింది తెలుగు జెండా, భారత జెండా అని ప్రశ్నించారు. మిగిలిన దేశం నుంచి వేరు చేసుకోవద్దని జగన్ కి సూచించారు. ఇంటర్నేషనల్ గా అయితే మనందరికీ ఒకే దేశం అంటూ సమీ టీజ్ చేశారు. దీనిపై మంత్రి విడదల రజినీ అతిగా ఆలోచించకుండా మీరూ భారతదేశానికి ఇలాంటి గొప్ప అవార్డును తీసుకురండి అంటూ సమీకి కౌంటర్ ఇచ్చారు. తమ మూలాలను గౌరవించుకోవడం వేర్పాటువాదం ఎలా అవుతుందని రజినీ ట్వీట్ చేశారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ మా భాష, సంస్కృతి ఎప్పటికీ మాకు గర్వకారణమేనని దేశభక్తిపై మీరు తీర్పులివ్వాల్సిన అవసరం లేదని కౌంటరిచ్చారు. గాయకుడు సమీ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మొత్తానికి భాష తెలియని సింగర్, రాష్ట్రంతో సంబంధలేని సింగర్ అద్నాన్ సమీ సీఎంపై చేసిన ట్వీట్ ఎటాక్ తో వైసీపీ సతమతమైంది. వైసీపీ క్యాంప్ నుంచి వచ్చిన ట్వీట్లకు రిప్లయి ఇచ్చిన సమీ, దేశభక్తి గురించి నాకు పాఠాలు చెప్పొద్దని, ఒక ముఖ్యమంత్రిగా ప్రదర్శించాలని రాజనీతిజ్ఞత తెలుసుకోవాలంటూ మళ్లీ ట్వీటారు. మొత్తానికి అద్నాన్ సమీకి రిప్లయిలు ఇవ్వడానికి ఐప్యాక్ టీములో నార్త్ ఇండియన్ మంత్రుల పేరుతో నానా తంటాలు పడుతున్నారు.
అద్నాన్ సమీతో వరుస పెట్టి తిట్టించుకుంటున్న వైసీపీ మంత్రులు...
Advertisements