సింహం సింగిల్‌గా వస్తుందని ఇన్నాల్లూ వైసీపీ చేసిన చాలెంజ్ ల వెనుక ఇంత భయం ఉందా అని తెలుగురాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని సొంత నియోజకవర్గం కుప్పంలో జీవో 1 పేరుతో అడ్డుకుంది వైసీపీ సర్కారు. ప్రచారరథం లాక్కున్నారు. టిడిపి అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. జీవో1 తీసుకురాక ముందే విశాఖలో పవన్ కల్యాణ్‌నీ ఇలాగే అడ్డుకున్నారు. అప్పుడు పవన్‌ని కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు చంద్రబాబుని అడ్డుకోవడంతో పవన్ బాబుని కలిశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకి సాగుతున్న పోరాటంలో భాగం అవుతామని ఇరువురు నేతలు ప్రకటించారు. టిడిపి-జనసేన అధినేత కలయిక కంటే వైసీపీ ఉలికిపాటే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. జగన్ సింహం అని సింగిల్ గా వస్తాడని సినిమా డైలాగులు చెప్పిన వైసీపీ నేతలు బాబు-పవన్ భేటీపై పందుల్లా గుంపుగా వచ్చి మాటల దాడికి దిగారు. పవన్-బాబు కలిస్తే మాకు నష్టం లేదంటూనే వైసీపీ నేతలు గుండెలు బాదుకోవడం చూస్తుంటే వైసీపీ క్యాంప్ షేక్ అవుతోందని స్పష్టం అవుతోంది. పవన్-బాబు భేటీపై వైసీపీలోని 10 మంది మంత్రులు, 151 మంది ఎమ్మెల్యేలూ స్పందించారు. వైసీపీ ఎంపీలూ, వైసీపీ కాపు నేతలు, వైసీపీ పెయిడ్ మీడియా- ఆర్టిస్టులూ రంగంలోకి దిగి విమర్శలు గుప్పించడం వైసీపీలో ప్రకంపనలకు అద్దం పడుతోంది.
చంద్రబాబు-పవన్ కలిస్తే, వైసీపీ ఉలిక్కిపడుతుంది ఇందుకా ?
Advertisements