ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు పేరిట, రెండు నెలల పాటు వినియోగదారుల పై బాదుడు ప్రారంభించిన ప్రభుత్వం, నెల రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలతో వెనక్కు తగ్గింది. దీంతో రెండు నెలల పాటు ఏపిలో ప్రతి ఇంట్లో విద్యుత్ షాక్ తో విలవిలలాడిన ఏపి ప్రజలు, ఈ నెల ట్రూ అప్ చార్జీలు లేకపోవటంతో, కొద్దిగా ఊరట పొందారు. వివిధ ప్రజా సంఘాలతో పాటు, రాజకీయ పార్టీలు, ప్రజలు, ట్రూఅప్ చార్జీల పై ఆందోళన చేసాయి. విద్యుత్ నియంత్రణ మండలి చేసిన పబ్లిక్ హియరింగ్ లో కూడా, అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఎప్పుడో వినియోగించిన కరెంటుకి, ఇప్పుడు మళ్ళీ చార్జీలు వసూలు చేయటం ఏమిటి అంటూ, నిలదీశారు. ఈ మొత్తం ట్రూఅప్ చార్జీలు అన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసారు. ఈ నేపధ్యంలోనే మొన్న జరిగిన హియరింగ్ అనంతరం, ఏపి విద్యుత్ నియంత్రణ మండలి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వసూలు చేసిన దాదాపుగా 600 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూళ్ళని ఇప్పటికే సదరన్, ఈస్ట్రన్ కంపెనీలను సర్దుబాటు చేసారు. అయితే సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇప్పటికీ సర్దుబాటు చేయలేదు. సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో కూడా బిల్లులు సర్దుబాటు చేయనున్నారు. ఎంత చేస్తారు అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read