ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వివాదం నడుస్తునే ఉంది. క-రో-నా తరువాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోలు నటించిన సినిమాలు విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోజు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదల అయ్యింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సినీ టికెట్లు ధరలు తగ్గిస్తూ, ఈ ఏడాది ఏప్రిల్ లో జీవో నెంబర్ 35ని విడుదల చేసింది. ఇది విడుదల చేసిన తరువాత, అందులో టికెట్లు రెట్లు తగ్గిస్తూ స్పష్టంగా పేర్కొంది. సి సెంటర్ల అంటే, పల్లెటూరుల్లో ఉండే టికెట్ ధరలను మరీ రూ.5 కు కుదించింది. దీని పైన అప్పట్లోనే సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసిన జీవో నెంబర్ 35లో ఉండే టేబుల్, ఏవైతే టికెట్ రేట్లు ఉన్నాయో, గ్రామాలు, మండల కేంద్రాలు, నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, వీటిల్లో ఏవైతే టికెట్ రేట్లను తగ్గించారో, ఆ టేబుల్ ని నిన్నటి నుంచి ప్రభుత్వ వర్గాలు తెర మీదకు తెచ్చాయి. ఆ రేట్లు ప్రకతమే టికెట్లు ఉండాలనే ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు, అనేది మాత్రం తెలియటం లేదు. ప్రభుత్వం నేరుగా ప్రచారం చేయకుండా, కొంత మంది చేత ఇప్పుడు ఈ జీవోని బయటకు తెచ్చి, ప్రచారంలో పెట్టింది.
తమ ప్రత్యర్ధి పార్టీలో ఉన్న బాలకృష్ణ సినిమా విడుదల అవుతుంది అనే ఉద్దేశంతోనే, ఈ రేట్లకే టికెట్లు అమ్మాలి అని నిర్దేశిస్తూ, ప్రభుత్వమే ఇలా ఒత్తిడి చేస్తుందని, నందమూరి అభిమానాలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు అఖండ సినిమా నుంచి మొదలు, అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాం చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా అన్ని సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి. ఇప్పటికే బెనిఫిట్ షోస్ ని ఆపేశారు. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా భారిగా తగ్గిస్తే, ఎలా అని సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సినీ పరిశ్రమ వర్గాలు ఇప్పటికే అనేక సార్లు మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు. టికెట్ రేట్లు గురించి అడిగారు. అయితే పరిశీలిస్తాం అని చెప్పారు కానీ, ఈ రోజు వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. టికెట్ రేట్లు ఇలాగె ఉంటే భారీ బడ్జెట్ సినిమాలు ఇక వచ్చే అవకాసం ఉండదని, భారీగా పరిశ్రమ నష్టపోయే అవకాసం ఉంటుందని సినీ పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.