ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం హెచ్చరిక పంపించింది. కేంద్ర ప్రభుత్వ పధకాలు పేర్లు మార్చి, జగన్ పేరు పెట్టుకోవటం కుదరదు అని చాలా స్పష్టంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, ఏపికి రాసిన లేఖలో చాలా స్పష్టంగా చెప్పింది. కేంద్ర పధకాలకు, జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ లాంటి పేర్లు పెట్టటం పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా, కేంద్ర పధకాలకు జగన్ పేర్లు పెట్టటం పై కూడా, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక నివేదికను కోరింది. మరో పక్క 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, అదే విధంగా ఐసీపీఎస్ పథకాలకు కేటాయించినటు వంటి రూ.187 కోట్ల లెక్కలు కూడా తమకు చెప్పాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పధకాలకు, ఏపి రాష్ట్ర ప్రభుత్వం తమకు నచ్చిన పేర్లు పెట్టుకోవటం అభ్యంతరకరం అని కూడా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పధకాలకు, రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చటం కుదరదు అని కూడా చాలా స్పష్టం చేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన పధకాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్లు మార్చటం, కేంద్రం ఇచ్చే వాటికి, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ అంటూ పేర్లు పెట్టటం పై కేంద్రం సీరియస్ అయ్యింది.
అయితే ఈ విషయం పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్రానికి లేఖ రాసి ఈ విషయం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, పధకాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రానికి ఏ మాత్రం క్రెడిట్ ఇవ్వకుండా, వాటి పేర్లు మార్చేసి, జగన్ పేరు, ఆయన తండ్రి పేరు పెడుతూ పధకాలు ఇవ్వటం పైన, రఘురామకృష్ణం రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేంద్రానికి లేఖ రాసారు. దీని పైన ఈ రోజు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రఘురామకృష్ణం రాజు రాసిన లేఖకు సమాధానం చెప్పాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. ఇక పైన కేంద్రం పధకాలకు పేర్లు మార్చవద్దు అంటూ స్పష్టం చేసారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ, మరీ ముఖ్యంగా సోము వీర్రాజు ఇలాంటి విషయాలు పట్ల, ఎందుకు తమ పార్టీనే ఉన్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటం లేదో అర్ధం కావటం లేదు. రఘురామకృష్ణం రాజు ఈ విషయాలను లేవనెత్తి కేంద్రానికి చెప్పే వరకు, కేంద్రానికి ఈ విషయం తెలియదు అంటే, ఇక్కడ ఉన్న ఏపి బీజేపీ ఎవరి కోసం పని చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.