ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సరిగ్గా సగం సమయం పూర్తి చేసుకుంది. రెండున్నరేళ్ళు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. సహజంగా ఏ ప్రభుత్వానికైనా, మూడున్నరేళ్ళు తరువాత ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత మొదలు అవుతుంది. అది ఎన్నికల నాటికి ఎక్కువ అవుతుంది. ఆ శాతం ఎంత వరకు, ప్రతిపక్షం తమ వైపు తిప్పుకుంటుంది అనే దాన్ని బట్టి, ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం, రెండున్నరేళ్ళకే భారీ ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సర్వేలు ఇదే చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రజల జీవితాలు దుర్భాలం అయిపోయాయి. నవరత్నాలు అనేవి, కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. చాలా మంది లబ్దిదారులకు అందటం లేదు. ఇక పెంచిన చార్జీలు, పెట్రోల్ రెట్లు, ఇంటి పన్నులతో, సామాన్యుడు సతమతం అవుతున్నాడు. మరో పక్క అభివృద్ధి అనేది సున్నా. ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. ఇక రోడ్డుల సంగతి సరే సరి. రాష్ట్రంలో ఆడ పిల్లలకు భద్రత లేదు. ఇళ్ళలోకి వచ్చి మరీ కొడుతున్నారు. పార్టీ ఆఫీస్ లకు రక్షణ లేదు, ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వాయించి వాయించి పడేస్తున్నారు. వీటి అన్నిటి నేపధ్యంలోనే, జగన్ పరిపాలన పై ప్రజలు వ్యతిరేక భావంతో ఉన్నారు.
2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ 50% ఉంది. 151 సీట్లు వచ్చాయి. అలాగే టిడిపి ఓటు షేర్ 40 శాతం ఉంది. 23 సీట్లు వచ్చాయి. అంటే ఇద్దరి మధ్య ఓటు షేర్ తేడా 10 శాతం ఉంది. అయితే తాజాగా సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఒక ప్రముఖ సర్వేలో వైసిపీని ఇబ్బంది పెట్టేలా సర్వే రిపోర్ట్ ఉన్నాయి. ఆ సర్వే ఆత్మసాక్షి అనే సంస్థ చేసింది. ఈ సంస్థ పై ప్రజల్లో విశ్వసనీయత కూడా ఉంది. ఇప్పుడు తాజా సర్వే ప్రకారం, వైసీపీ ఓట్ల శాతం 46.5% పడిపోగా , టిడిపి ఓట్ల శాతం 43.5 శాతానికి పెరిగింది. అంటే పది శాతం తేడా నుంచి 3 శాతానికి గ్యాప్ పడిపోయింది. ఈ సర్వే శాంపిల్ కూడా 68,200 మందిది కావటంతో, సర్వే పరిణామం కూడా పెద్దదే అని చెప్పుకోవచ్చు. అదీ కాక ఈ సర్వే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగింది. ఈ మధ్య కాలంలో అనేక అంశాలు తెర పైకి వచ్చాయి. సహజంగా ముడున్నరేళ్ళ తరువాత ఉండే వ్యతిరేకత జగన్ కు ఇప్పుడే వచ్చింది. ఇప్పటికైనా అనవసర విషయాల పైన కాకుండా, ప్రజలకు ఉపయోగ పడే విషయాల పైన దృష్టి పెడితే అందరికీ మంచిది మరి.