ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ పబ్బం అనే తేడా లేకుండా జేసీబీలు పని చేస్తున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలోని సియం రోడ్డు విస్తరణ పేరిట, అక్రమ కట్టడాల నెపంతో అపార్ట్ మెంట్ సెల్లార్లు, అలాగే అపార్ట్ మెంట్లలో కొంత భాగాన్ని ఉదయం నుంచే జేసీబీలతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ చర్యతో అక్కడ ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఉదయం నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, భవనాలు కొట్టేస్తున్నారని, అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ అధికారులు వచ్చి అక్రమ కట్టడం పేరిట కూల్చేస్తున్నారని, నోటీసులు కూడా ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే, ఈ కూల్చివేతకు నిరసనగా, వారి వారి భవనాల ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. అయితే అక్కడ ఉన్న మహిళలకు మహిళా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు ఒక వలయంగా ఏర్పడటంతో, కూల్చివేతలు తిరిగి ప్రారంభం అయ్యాయి. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమంగా కట్టిన వాటిని కూల్చివేస్తున్నాం అని అధికారులు చెప్తూ ఉండగా, అక్కడ ప్రజలు మాత్రం దానికి అభ్యంతరం చెప్తున్నారు. తాము భావనలు నిర్మించుకున్న సమయంలో, అప్పుడు పర్మిషన్ ఇచ్చారని, ఇప్పుడు వచ్చి కూల్చివేస్తున్నారని. ఆ రోజు అధికారులు ఏమి చేసారని ప్రశ్నిస్తున్నారు. ఉద్రిక్తతల మధ్యే ఈ కూల్చివెతలు సాగుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read