ప్రతి క్రిస్మస్ కు రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఇడుపులపాయకు వెళ్లి పండగ జరుపుకుంటారనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సారి కూడా ఎప్పటి లాగానే ఆనవాయితీ ప్రకారం జగన్మోహన్‌రెడ్డి, చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ, ఇతర కుటంబ సభ్యులు గురువారామే ఇడుపులపాయకు వచ్చారు. అయితే గురువారం రోజు రాత్రి అన్నా, చెల్లిళ్ళ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు పెద్ద ఎత్తున మీడియాలో కధనాలు వచ్చాయి. దీనితో ఆ రోజు రాత్రే షర్మిల ఇడుపులపాయ అతిథిగృహం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసినట్టు మీడియాలో వర్తలువ్ అచ్చయి. తన కన్న కూతురు కోపంతో వెళ్లిపోతుంటే విజయమ్మ కూడా కూతురు కారులోనే ఇడుపులపాయలోని తన నివాసగృహానికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ గొడవతో విజయమ్మ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని, అటు కొడుక్కి, ఇటు కూతురుకి చెప్పలేని పరిస్థితిలో అక్కడ నుంచి వెల్లిపోయినట్టు సమాచారం. ఇప్పటివరకు అన్నా,చెల్లిళ్ళ మద్య గోడవలన్నీ ఊహాగానాలే తప్ప స్పష్టత లేదు కాని, ఈ గోడవతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని కలహాలు బట్టబయలయ్యాయి అనే ప్రచారం జరుగుతుంది. గురువారం రాత్రి జగన్ ,చెల్లి షర్మిల మద్య ఆస్తి గురించి పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న కధనాలు ద్వారా తెలుస్తుంది.
ఆరాత్రి ఆస్తుల పంపకం పై ఇద్దరి మధ్య సంభాషణ వచ్చిందని, అయితే నీ వల్ల నాకు చాల ఇబ్బంది ఇందని, తెలంగాణలో రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావని కూడా జగన్ షర్మిలను ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. దీనితో ఆస్తిలో తనకు రావలిసిన వాటా రాయమని షర్మిల అడగటంతో, జగన్ కోపంతో ఊగిపోయారని, తెలంగాణలో పార్టీ పెట్టి తప్పు చేసావు, మళ్ళీ నీకు ఆస్తుల్లో వాటా కూడానా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రం ఇవ్వను అని షర్మిల పై విరుచుకు పడ్డారని ఆ కధనాల సారంశం. షర్మిల కూడా అదే రీతిలో స్పందించి, ఈ విషయం ఎలా తెల్చుకోవలో నాకు తెలుసు అని, ఆ రోజు రాత్రే షర్మిల కోపంగా అక్కడ నుంచి బయలు దేరి హైదరాబాద్ వచ్చేసినట్టు తెలుస్తుంది. రాజశేఖరరెడ్డి చనిపోవడం, ఆస్తుల పంపకాలు మిగిలి ఉండటం, తరువాత అన్నా,చెల్లిళ్ళ మద్య గొడవలతో, ఈ ఆస్తుల అంశం చుట్టూనే ఇద్దరికీ చేదినట్టు సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఈ కధనం వచ్చి మూడు రోజులు అవుతున్నా, అటు షర్మిల వైపు నుంచి కానీ, జగన్ వైపు నుంచి కానీ, విజయమ్మ వైపు నుంచి కానీ, ఎలాంటి ఖండన లేకపోవటం కొస మెరుపు. సహజంగా ఇలాంటి కధనాల పై గతంలో, ఖండిస్తూ ప్రెస్ నోట్లు విడుదల చేసే వారు. కానీ, ఈ సారి మాత్రం అవేమి లేవు.