సుప్రీం కోర్టు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సుప్రీం కోర్టు, దేవాలయాల్లో హిందూయేతరులకు షాపుల కేటాయింపుల పై ఇచ్చిన తీర్పుని జగన్ సర్కార్ అమలు చేయకపోవటం పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. జగన్ సర్కార్ పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో, ఏపి ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో, అన్య మతస్థులకు, దేవాలయాల్లో షాపుల వేలంపాటలో పాల్గునటం పై ఇచ్చిన జీవోని హైకోర్టులో సవాల్ చేయగా, ఏపి హైకోర్టు కొట్టేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుని, సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించినప్పటికీ కూడా, జగన్ సర్కార్, కర్నూల్ లో ఉన్నటు వంటి శ్రీ బ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌ స్వామి దేవాలయం షాపు యజమానులను ఖాళీ చేయించటం జరిగింది. అయితే సుప్రీం కోర్టులో స్టే ఉన్నా కూడా, జగన్ ప్రభుత్వం, సుప్రీం కోర్టు స్టే ని అమలు చేయకుండా ఉండటంతో, సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ ను దాఖలు చేయటం జరిగింది. ఆ ధిక్కార పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ చేసారు. న్యాయమూర్తులు చంద్రచూద్, బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం, గతంలో ఇచ్చిన సుప్రీం కోర్ట్ తీర్పుని అమలు చేయాలని మరో సారి స్పష్టం చేసింది. ఏపి ప్రభుత్వం ఇచ్చిన జీవోని కొట్టేసి, హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read