యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తనను సిఐడి అధికారులు ఎలా టార్చర్ పెట్టింది వివరిస్తూ, నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన వ్యాఖ్యలే చేసారు. రఘురామరాజు విషయంలో సిఐడి వ్యవహరించిన తీరు పై ప్రశ్నించగా, మొన్న లక్ష్మీనారాయణ గారి ఇంటి పైకి అర్ధరాత్రి ఎలా వచ్చి ఆయన్ను తీసుకుని వెళ్ళటానికి ట్రై చేసారో, అలాగే నా ఇంటి మీదకు వచ్చారని అన్నారు. 30 మంది వరకు వచ్చి, నన్ను ఎత్తి వ్యాన్ లో పడేసి, అక్కడకు తీసుకుపోయారని అన్నారు. నన్ను చాలా చిత్ర హింసలు పెట్టారని, స్వతంత్ర భారత దేశంలో, ఒక ఎంపీని ఇలా థర్డ్ డిగ్రీ చేయటం మొదటి సారి అని రఘురామరాజు అన్నారు. ఇక తనను హింసించిన అధికారి ఎవరో తనకు బాగా తెలుసనీ, ఎంక్వయిరీ వచ్చినప్పుడు వాడి పేరు అన్నీ చెప్తానని అన్నారు. ఆ అధికారి, వాడి ఫోన్ లో, వాడి పై వాడికి చూపించటంతో, ఆ పై వాడు స్పైడర్ సినిమాలో, ఒక సాడిస్ట్ విలన్ లాగా ఆనందించి, ఇంకా వాయించండి అన్నాడని తెలిసింది. ఫోన్ పెట్టటం అదీ, మొత్తం నేను చూశానని తెలిపారు. అప్పటి వరకు జీవితంలో దెబ్బలు తినలేదని అన్నారు. తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, ఎప్పుడూ ఆ అవసరం రాలేదని అన్నారు. మొదటి దెబ్బే, పోలీస్ దెబ్బ అని అన్నారు. ఎంపీ అయ్యిండి, కొట్టించుకోవటం, నేను రికార్డుల్లో నిలిచిపోయానని అన్నారు. అది మామూలు కొట్టుడు కాదని రఘురామ రాజు అన్నారు.
జగన్ తో అసలు ఎక్కడ చెడింది అని అడగగా, ముందుగా మాతృభాష పైన బోధనా ఉండాని, రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని లేవనేత్తానని, ఆ సమయంలో మిథున్ రెడ్డికి శభాష్ అన్నాడని, తరువాత సాయంత్రానికే జగన్ నీ పైన కోపంగా ఉన్నాడని చెప్పారని వాళ్ళు చెప్పారని అన్నారు. తరువాత నేషనల్ మీడియాలో క్రీస్టియానిటీ పైన మాట్లాడానని, ఆ తరువాత ఒక రోజు ఎంపీల సమావేశంలో, ఢిల్లీలో మన ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, అలా కలవటానికి వీలు లేదని , నన్ను ఉద్దేశించి కాకపోయినా, నాకు తగిలేలా జగన్ వ్యాఖ్యలు చేసారని అన్నారు. పార్లమెంటు లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించటంతో, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, ఒక పెద్ద బోకే చేపించి, జగన్ దగ్గరకు వచ్చానని, అయతే అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి, నన్ను కలవటానికి ఇష్ట పడక పోవటంతో, ఇంత పెద్ద బోకే ఏమి చేయాలో తెలియక, ఇంతకంటే పెద్ద వ్యక్తికీ ఇది ఇవ్వాలని, అప్పటికప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని, ఆ బోకే ఆయనకు ఇచ్చానని, తనకు జరిగిన అవమానం గురించి తెలిపారు.