ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రగడ నడుస్తున్న సందర్భంలోనే, ఏపి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఏపి ఆన్లైన్ టికెట్ల పై ముందుకు వెళ్తూ, కీలక అడుగు వేసింది. ఎఫ్‌టీవీటీడీసీ అంటే (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌ టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ను, ఆన్లైన్ టికెట్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ఉత్తర్వులతో, ఆన్లైన్ టికెట్ పోర్టల్ రూపకల్పనతో ఎఫ్‌టీవీటీడీసీ, కార్యాచరణ ప్రరంభించింది. అలాగే పోర్టల్ రూపకల్పనకు సంబంధించి, ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ సంస్థలతో, వివిధ సినిమా ధియేటర్ ల తో, ప్రైవేట్ టికెటింగ్ ఏజెన్సీలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తుంది. అలాగే సాంకేతిక, న్యాయ పరమైన వివాదాలు రాకుండా చూడాలని కూడా ఎఫ్‌టీవీటీడీసీని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మరి కొద్ది రోజుల్లోనే పోర్టల్ అందుబాటులోకి రాగానే, ఆన్లైన్ టికెట్ల వ్యవహారం మొదలు కానుంది. ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల పై, సినిమాటోగ్రఫీ చట్టాలను సవరణలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు కూడా ఆమోదించింది. దీనికి సంబందించే, ఈ రోజు ఎఫ్‌టీవీటీడీసీని ఆన్లైన్ టికెట్ పోర్టల్ కు సంబంధించి, నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read