చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణ, తాను చీఫ్ జస్టిస్ అయిన తరువాత, మొదటి సారి అమరావతిలో పర్యటించనున్నారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు. ఇప్పటికే చీఫ్ జస్టిస్ అయిన తరువాత, ఆయన తిరుమల రెండు మూడు సార్లు వచ్చారు. తరువాత డాలర్ శేషాద్రి మరణం అప్పుడు వచ్చారు. అయితే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తరుచూ తెలంగాణాలో పర్యటిస్తూ, అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గుంటున్నారు. మొదటి సారి తెలంగాణాలో చీఫ్ జస్టిస్ హోదాలో అడుగు పెట్టిన సమయంలో, ఆయనకు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మన ఏపిలో మాత్రం, ప్రభుత్వం అలాంటివి ఏమి చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి, ఆయన చీఫ్ జస్టిస్ అవ్వకుండా, అప్పట్లో ఉత్తరాలు రాసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొంత మంది చేత, కోర్టులు టార్గెట్ గా చేస్తున్న క్యాంపైన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పుడు మొదటి సారిగా మూడు రోజుల పాటు, చీఫ్ జస్టిస్ ఏపిఓ ఉండటంతో, ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుందో చూడాలి. ప్రోటోకాల్ ప్రకారం చెయ్యల్సినవి ఎలాగూ చేస్తారు కానీ, మన ఏపి బిడ్డ, ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యారు కాబట్టి, ప్రభుత్వం తరుపున ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయో చూడాలి.

cji 19122021 2

ఇక చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు ఏపిలో పర్యటిస్తారు. డిసెంబర్ 24 నుంచి, తన సొంత గ్రామం పొన్నవరంలో పర్యటిస్తారు. మొదటి సారి చీఫ్ జస్టిస్ అయిన తరువాత సొంత గ్రామానికి వెళ్తూ ఉండటంతో, అక్కడ ప్రాజలు ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ నెల 26న నాగార్జునా యూనివర్సిటీలో హైకోర్టు న్రివహిస్తున్న సదస్సులో కూడా హాజరు అవుతారు. జస్టిస్ ఎన్వీ రమణ, నాగార్జున యూనివర్సిటీ నుంచే డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక అదే రోజున ఆయన అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, హైకోర్టు ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు. అంతకు ముందు అమరావతి శంకుస్థాపనకు కూడా ఆయన వచ్చారు. మళ్ళీ ఇన్నేళ్ళకు, ఆయన అమరావతిలో అడుగు పెట్టనున్నారు. మొత్తం మీద చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మూడు రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్ లో, అదీ కాక, అమరావతిలో కూడా పర్యటించటం ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆయన ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read