ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉన్న ప్రయారిటీలు వేరు. ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి, వంటి వాటి పైన , జగన్ సర్కార్ కు ప్రయారిటీ తక్కువ అనే చెప్పాలి. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నా, తాజాగా ఉన్న ఉదాహరణ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలతో సతమతవుతుంది. అదే మరొకరు అయితే, ఈ గండం ఎలా గట్టేక్కాలా అని నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కేవలం కక్ష కక్ష కక్ష అనే దాని పైనే ఫోకస్ పెట్టింది. తాను అనుకున్నది జరిగి తీరాలి అనే పట్టుదలతో, తప్పుల మీద తప్పులు చేయటం, అదేమిటి అంటే కోర్టులను తిట్టటం ఒక నిరంతర ప్రక్రియ అయిపొయింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని, ఎక్కడైనా ఒక ప్రభుత్వం తప్పిస్తుందా ? తన మాట వినటం లేదని, మండలినే రద్దు చేస్తారా ? ఇలా ఒక తప్పు చేసి, ఆ తప్పుని సమర్ధించటానికి వంద తప్పులు చేయటం, ఈ ప్రభుత్వానికి అలవాటు. తాజాగా ఇప్పుడు సినిమా టికెట్ల రగడ. ప్రభుత్వమే టికెట్లు అమ్ముతుంది అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. టికెట్ ధరలు తగ్గిస్తాం అన్నారు. ఆ తగ్గించేది, కొంత మేరకు తగ్గిస్తే పరవాలేదు. నిర్మాతలకు నష్టం వచ్చేలా తగ్గిస్తే ఊరుకుంటారా ? రూ.5 సమోసా కూడా రావటం లేదు, మరి నేల టికెట్ రేటు అది పెడితే ఎలా ?
బెనిఫిట్ షోలు ఇష్టం అయిన వాళ్ళు వేసుకుంటారు, వెళ్తారు. అది కూడా రద్దు చేసారు. సినిమా పరిశ్రమ తనకు అనుకూలంగా లేదని, మొత్తాన్ని దెబ్బ తీయాలనే కుట్ర ఇందులో ఉంది. అయితే కోర్టుకు వెళ్ళటం, కోర్టు సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో కొట్టేసింది. దీని పైన అపీల్ కు వెళ్ళింది ప్రభుత్వం. ఇక్కడితో ఆగలేదు. ప్రతి సినిమా ధియేటర్ ని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశాలు వెళ్ళాయి. టికెట్ ఎంతకి అమ్ముతున్నారు, కరెంటు బిల్లులు కట్టారా ? బాకీ ఉన్నాయా ? క్యాంటీన్ ల లో నాణ్యత, పార్కింగ్ సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ, సిసి టీవీ కెమెరాలు ఉన్నాయా, ఇలా మొత్తం రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఈ రిపోర్ట్ లు కలెక్టర్ల వద్దకు, అక్కడ నుంచి సియం ఆఫీస్ కు వెళ్తాయి. మరి ఈ సీక్రెట్ రిపోర్ట్ తెప్పించుకుని, తరువాత ఏమి చేస్తారో తెలియదు. కోర్టులో వాదన కోసం ఈ రిపోర్ట్ తెప్పించారా ? లేక ధియేటర్ లకు భారీ షాక్ ఇవ్వటానికి రెడీ అయ్యారా అనేది చూడాలి. ఒక పక్క ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతుంటే, ప్రభుత్వ ప్రయారిటీలు మాత్తరం, ఇలా ఉన్నాయి మరి.