మూడు రాజధానులకు మద్దాటుగా, రాయలసీమ అభివృద్ధి పేరుతో, తిరుపతిలో నిర్వహిస్తున్న సభకు, జనాలను తరలించేందుకు అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడితో కొందరు, మెప్మా అధికారులు, డ్వాక్రా మహిళల గ్రూపుల్లో కొందరు మహిళలను బెదిరించినట్టు, ఆడియోలు వైరల్ అవుతున్నారు. అయితే ఈ రోజు సభ ప్రారంభం అయిన తరువాత కూడా, ఆ మీటింగ్ లో మొత్తం డ్వాక్రా మహిళలే పెద్ద ఎత్తున ఉన్నారు. తరువాత కొంత మంది విద్యార్ధులు ఉన్నారు. మహిళలను, కాలేజీ విద్యార్ధులను పెద్ద ఎత్తున తరలించినట్టు, అక్కడ సీన్ చూస్తే అర్ధం అవుతుంది. మహిళలు, సభకు హాజరు కాకపొతే, వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని, ఆ డబ్బుతోనే సభకు ప్రజలను తరలిస్తామని, ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆ బెదిరింపులకు భయపడి, మహిళలు వచ్చారు. అయితే ఇక్కడకు వచ్చిన మహిళలతో, మీడియా ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూ చేయగా అసలు విషయం బయట పడింది. ఎందుకు ఇక్కడకు వచ్చారు అంటే, డ్వాక్రా మీటింగ్ అని తీసుకుని వచ్చారని చెప్పారు. మరి కొందరు, మాకు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, మూడు రాజధానులు చేస్తే, రాష్ట్రం మూడు ముక్కలు అవుతుందని అన్నారు. ఇలా చిత్ర విచిత్ర సమాధానాలు చెప్పారు.
వచ్చిన వారికి సభ ఎందుకు పెట్టారో తెలియదు. రాజధాని ఎక్కడ ఉండాలి అంటుంటే, మహిళలు మాత్రం, అమరావతి అని చాలా మంది అన్నారు. నిర్వాహాకులు కూడా అసలు ఏమి చెప్పాలి అనుకున్నారో వారికి కూడా అర్ధం కాలేదు. నిర్వాహకులు కంటే, ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. తమకు అభివృద్ధి కావాలని, ఉద్యోగాలు కావాలని, కానీ ఈ మూడు రాజధానుల ఆటను మాత్రం, అంగీకరించటం లేదు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి, అందరూ అమరావతే కావాలని అంటున్నారు. ఉద్యోగాలు లేక వలస పోయే బాధ అక్కడ వారిలో ఉంది. అయితే ఇక్కడ నిర్వాహకులు మాత్రం, అసలు ఈ సభ ఎందుకు పెట్టామో, రాయలసీమ అభివృద్ధి ఏమిటో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అక్కడ ఉంది. కేవలం పోటీ సభలా ఉంది కాని, సీమ ప్రాంతాల అభివృద్ధికి ఏమి కావాలో చెప్పటంలో ఫెయిల్ అయ్యారు. నిన్న అమరావతి సభకు అన్ని పార్టీలు మద్దతు లభిస్తే, వైసీపీ చేసిన మూడు రాజధానుల మీటింగ్ కూడా కేవలం వైసీపీ మాత్రమే వచ్చింది. మరో పక్క మీటింగ్ మొదలైన కొంత సేపటికి, అక్కడ నుంచి వెళ్లిపోతుంటే, గేట్లు వేసి మహిళలను ఆపేసారు.