ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపిన అంశం, అసెంబ్లీలో కూడా రాజకీయాల్లో లేని ఆడవాళ్ళ క్యారక్టర్ పై వ్యాఖ్యలు చేస్తూ, రాజకీయాన్ని దిగజార్చటం. కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచి, చంద్రబాబుని చూడాలని ఉంది అంటూ, మొదలైన వైసీపీ రాక్షసత్వం, చివరకు ఇక్కడ వరకు వెళ్ళింది. కుప్పంలో చంద్రబాబుని ఓడించాం, ఇక మాకు తిరులేదు చంద్రబాబు కుంగిపోయి ఉంటాడు అని అనుకున్న వైసీపీకి చంద్రబాబు షాక్ ఇస్తూ, అసెంబ్లీకి వచ్చి, ధీటుగా నిలబడి, ఎక్కడ నుంచి మొదలు పెడదాం అంటూ వ్యాఖ్యలు చేయటంతో, వైసీపీ తట్టుకోలేక పోయింది. చంద్రబాబు సతీమణి పై దూషణలకు దిగారు. ముఖ్యంగా కొడాలి నాని, ద్వారంపూడి, అంబటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే దీని పై చంద్రబాబు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోవటం, అందరినీ కలిచి వేసింది. నారా భువనేశ్వరి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, సంఘీభావం ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ ఘటనతో పరువు పోగొట్టుకున్న వైసీపీ, నారా భువనేశ్వరికి క్షమాపణ నాటకాలు చెప్పించింది. ఈ అంశం ఇక్కడితో ముగిసిపోయిందని సంతోషించింది. అయితే నారా భువనేశ్వరి ఈ రోజు తిరుపతి వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని సందర్శించి, వరద వల్ల మృతి చెందిన కుటుంబాలకు లక్ష రుపాయల సాయం అందించారు.

nara 20122021 2

ఈ సందర్భంగా ఆమె, అసెంబ్లీ ఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నోటికి వచ్చినట్టు ఆడవాళ్ళ పై మాట్లాడటం మంచిది కాదని అన్నారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని, సమాజానికి ఉపయోగ పడే విమర్శలు చేయాలని, పనిలేని విమర్శలు ఎందుకు అని అన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడ్డానని, తన భర్త కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. ఒక పెద్ద రాష్ట్రానికి నా భర్త అందించిన సేవలు, చేసిన అభివృద్ధి తనకు తెలుసనీ, రాత్రి పగలు, నిద్ర లేకుండా ఆయన పని చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసారని అన్నారు. తన భర్త గురించి ప్రజలకు తెలుసని అన్నారు. వైసీపీ విమర్శలు తాను పట్టించుకోనని, తన పై వ్యాఖ్యలు చేసిన వారు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని అన్నారు. తనకు వాళ్ళ క్షమాపణలు అవసరం లేదని అన్నారు. ఇలాంటి వాటిని పట్టించుకుని టైం వెస్ట్ చేసుకోనాని, సమాజ సేవ గురించి తాము ఆలోచిస్తామని అన్నారు. హెరిటేజ్ గురించి మాట్లాడుతూ, హెరిటేజ్ ని ఎవరూ టచ్ కూడా చేయలేరని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read