వైఎస్ వివేక కేసులో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్ని ట్విస్ట్ లు, ఇన్నేళ్ళు, ఇన్ని దర్యాప్తు సంస్థలు వచ్చినా, అసలైన పెద్దలను మాత్రం, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు. సిబిఐ దర్యాప్తు ముందుకు వెళ్తుంది, అసలైన వారు దొరికేస్తారు అనుకునే టైంలో, మరో ట్విస్ట్ చోటు చేసుకోవటం, మళ్ళీ మొదటికి రావటం జరిగిపోతుంది. అయితే ఈ మధ్య ఎంపీ అవినాష్ రెడ్డి, సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీలో కీలక వ్యక్తి, అలాగే వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు. పులివెందులలో కీలక వ్యక్తి. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి, సన్నిహితుడుగా ఉంటారని అందరికీ తెలుసు. ఇలాంటి కీలక వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేయటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఇదే సమయంలో గత 15 రోజులు నుంచి, కొంత మంది వ్యక్తులు వైఎస్ సునీత, ఆమె భర్త టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేక కేసులో, తమకు వివేక కూతురు, అల్లుడు పైన అనుమానం ఉందని చెప్తున్నారు. అయితే దీని పై ఎటువంటి ట్విస్ట్ చోటు చేసుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, తనను అన్యాయంగా అరెస్ట్ చేసారని, తమకు బెయిల్ ఇవ్వాలి అంటూ, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటీషన్ వేసారు.

devireddy 22122021 2

ఆలాగే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటుగా, ఉమాశంకర్‌రెడ్డి అనే మరో కీలక వ్యక్తి కూడా బెయిల్ పిటీషన్ వేసారు. అయితే వీరి ఇద్దరి బెయిల్ పిటీషన్ల ను కొట్టేస్తూ, ఇద్దరికీ షాక్ ఇచ్చింది కడప కోర్టు. ఇరువురూ వేసిన బెయిల్ పిటీషన్ పైన గత వారమే వాదనలు జరిగాయి. వాదనలు ముగియటంతో, తీర్పు రిజర్వ్ లో పెట్టిన కోర్టు, నిన్న నిర్ణయం ప్రకటిస్తూ, ఇద్దరి పిటీషన్లను కొట్టేసింది. అయితే మరో పక్క, సిబిఐ కూడా దూకుడు పెంచింది. పులివెందుల కోర్టులో సిబిఐ ఒక పిటీషన్ దాఖలు చేసింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షలు చేయాలని, అనుమతి కావాలి అంటూ కోర్టులో పిటీషన్ వేసింది. సిబిఐ వేసిన ఈ పిటీషన్ ను, కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ పైన, నార్కో పరీక్షల కోసం, శివశంకర్ రెడ్డి సమ్మతను కోర్టు కోరనుంది. మరి ఈ కేసులో కడిగిన ముత్యం లాగా బయటకు రావాలి అంటే, ఇంతకంటే మంచి అవకాసం ఉండదు. మరి శివశంకర్ రెడ్డి ఏమని సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి, వివేక కేసు అనేక మలుపులు తిరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read