స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో, సిఐడి డొల్లతనం మరోసారి బట్టబయలు అయ్యింది. నిన్న ఘంటా సుబ్బారావు బెయిల్ పిటీషన్ సందర్భంగా, స్పందించిన హైకోర్టు, సిఐడి తీరుని తప్పుబట్టింది. రెండు నెలల వ్యవహారంలో ఏమి తేల్చారని, కొందరిని మాత్రమే ఎందుకు కేసుల్లో పెట్టారని ప్రశ్నించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాష్ట్ర హైకోర్టు నిన్న కొన్ని కీలకమైన, మౌళికమైన ప్రశ్నలు లేవనెత్తింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అప్పట్లో ఎవరు అయితే నిధులు విడుదల చేసారో, ఆ నిధులు విడుదల చేసిన అధికారులకు నోటీసులు ఇవ్వకుండా, సెలెక్ట్ అండ్ పిక్ అప్ అనే విధానం కింద, మీరు కొంత మంది అధికారులనే సెలెక్ట్ చేసి, నోటీసులు ఎందుకు ఇచ్చారు అని హైకోర్టు ప్రశ్నించింది. అదే విధంగా ఎవరు అయితే, ఈ రోజు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుని, షరతులతో కూడిన బెయిల్ పొందిన ఘంటా సుబ్బారావు, ఆయన విషయంలో నిధులు దుర్వినియోగం చేసినట్టు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అని, ఆ ఆధారాలు కూడా అంద చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపధ్యంలోనే, ఆ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీలో ఎవరు అయితే పర్చేజేస్ కి, మానిటరింగ్ కి రెండు కమిటీలు ఏర్పాటు చేసారో, కమిటీలో ఐఏఎస్ అధికారులు అందరికీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.

hc 211122021 2

సెలెక్ట్ చేసిన కొంత మందికి మాత్రమే నోటీసులు ఇవ్వటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తమకు వివరించాలని చెప్పి, హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే , దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు, నిన్న అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రేమ్ చంద్రారెడ్డికి, అలాగే అప్పటి ఫైనాన్సు అధికారి పీవీ రమేష్ కు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే నిన్న హడావిడిగా కదిలిన సిఐడి ఇద్దరికీ కేవలం సాక్షిగా నోతీసులు ఇచ్చి చేతులు దులుపేసుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, కోర్టు ప్రశ్నించిన తరువాతే, వీరికి నోటీసులు ఇవ్వాటం పైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ వారిని అరెస్ట్ చేసి ,నానా భీబత్సం సృష్టించి, ఇక్కడ వీరికి మాత్రం కేవలం నోటీసులు ఇవ్వటం కూడా గమనించాల్సిన అంశం. మొత్తం మీద కోర్టులో చీవాట్లు పడకుండా, ఇలా నోటీసులు ఇచ్చి, మమా అనిపించారు. హైకోర్టు వేసిన ప్రశ్నలకు సిఐడి, రెండు వారాల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరో పక్క ఘంటా సుబ్బారావుకు బెయిల్ లభించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read