ఒంగోలులో సుబ్బారావు గుప్తా పైన, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక విధంగా చెప్పాలి అంటే, వైసీపీ మార్క్ ఏమిటో చూపించారు. తమకు అడ్డు వస్తే, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదనే సిగ్నల్ ఇచ్చారు. ఒంగోలులో రెండు రోజుల క్రితం జరిగిన సభలో, సుబ్బారావు గుప్తా అనే వైసీపీ నేత, వైసీపీ పార్టీలో బూతులు మాట్లాడే నేతల పైన, వారి వల్ల పార్టీకి జరుగుతున్న నష్టం చెప్తూ, బాధ పడ్డారు. ఈ క్రమంలోనే వంశీ, నాని, అంబటి, ద్వారంపూడిలను ఎదవలుగా సంబోధించాడు. వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అలంటి వారి వల్ల పార్టీ ఓటు బ్యాంక్ పడిపోతుందని, రేపు మనం ఓడిపోతే టిడిపి వాళ్ళు ఉరికించి రోడ్డుల మీద కొడతారని, మీరందరూ బాగానే ఉంటారని, రేపు మా లాంటి వారు ఇబ్బంది పడాలని, పద్దతి మార్చుకోవాలని అన్నారు. అంతే ఇంకేముంది, వైసీపీలో బీపీ బ్యాచ్ కి, బీపీ పెరిగిపోయింది. ముందుగా సుబ్బారావు గుప్తా ఇంటి మీద పడ్డారు. ఆయన భార్య ఒక్కటే ఉంటే, ఆమెను బెదిరించారు. ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడేసి, సుబ్బారావు గుప్తా బండి కూడా ధ్వంసం చేసారు. దీంతో సుబ్బారావు గుప్తా భయపడి పోయి, ఇంటికి రాకుండా, ఒక లాడ్జిలో తల దాచుకున్నాడు. వీరి బారి నుంచి కాపాడుకోవచ్చు అని అనుకున్నాడు.

subbarao 2112021 2

అయితే అతను ఉంటున్న లాడ్జిని పసిగట్టిన బీపీ బ్యాచ్, సుబ్బారావు గుప్తాని పట్టుకున్నారు. వీడియో తీసి మరీ, పిచ్చి కొట్టుడు కొట్టారు. మా అన్ననే ఎదిరిస్తావురా అంటూ, పిచ్చి కొట్టుడు కొట్టారు. అతను కొట్టవద్దు అని ఎంత వేడుకున్నా, పీకుతూనే ఉన్నారు. అక్కడితో ఆగిందా అంటే లేదు. ఈ కొట్టుడు మొత్తం వీడియో తీసి, వాళ్ళే బయటకు వదిలారు. ఇది మా నైజం, మా జోలికి వస్తే తాట తీస్తాం అని, బెదిరించారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ అంశం పైన మంత్రి బాలినేని స్పందించారు. అతన్ని కొడుతున్నారు అని తెలిసి , నేనే మా వాళ్ళని ఆపమన్నానని అన్నారు. అలాగే సుబ్బారావు గుప్తా మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇదే విషయం ఆయన భార్య తమకు చెప్పిందని, ఇంట్లో కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని చెప్పిందని బాలినేని అనటంతో, అందరూ షాక్ అయ్యారు. వెంటనే డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కడ కూడా, ఇలాగే కొట్టి, పిచ్చి వాడిని చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది మరి. ముగింపు మాత్రం అలా ఉండ కూడదని కోరుకుందాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read