ఒక పక్క రాష్ట్రం మొత్తం, ఏపిని అప్పుల పాలు చేసారని చెప్తున్నా విజయసాయి రెడ్డి మాత్రం, మళ్ళీ అప్పు కావాలని కేంద్రాన్ని కోరారు. అదనపు రుణ సేకరణపై రాజ్యసభ్యలో ప్రస్తావించారు వైసీపీ ఎంపీ విజయసాయి. అదనపు రుణ సేకరణకు ఏపీకి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరారు విజయసాయి. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటుతో నెట్టుకొస్తున్నామన్న విజయసాయి,  జీఎస్‍డీపీలో అదనంగా 0.5 శాతం రుణ సేకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అధిక వృద్ధి రేటు సాధనకు ప్రతి రాష్ట్రం తపన పడుతుందని అన్నారు విజయసాయిరెడ్డి. అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు ఏపీ కృషి చేస్తోందని, రాష్ట్ర విభజన వేళ ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రెవెన్యూ వనరులన్నీ తెలంగాణకు తరలిపోయాయన్న విజయసాయి, అశాస్త్రీయ విభజన వల్ల ఏపీ సతమతమవుతోందన్న తెలిపారు. రెవెన్యూ లోటు అనివార్యమని 14వ ఆర్థిక సంఘం తెలిపిందని, కేంద్రం నుంచి ఆశించిన సాయం అందట్లేదని అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని, ఎక్కువ అప్పుకి అవకాసం ఇవ్వాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read