హైదరాబాద్ లో జరిగిన, స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవరాలు, చిన్న కుమార్తె, కూతురు  వివాహ వేడుక సందర్భంగా,పెళ్ళికుమార్తె ను చేసిన వేడుకలో, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గున్నారు. అయితే గత రెండు దశాబ్దాలుగా విబేధాలు ఉన్నటు వంటి పరిస్థితిలు మధ్య చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ సందర్భంగా, చంద్రబాబు కుటుంబం, దగ్గుబాటి కుటుంబం కలిసి ఆ ఫంక్షన్ లో పాల్గునటం, ఆ ఫోటోలు బయటకు రావటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. ఈ ఫోటోలు చూసిన నందమూరి, టిడిపి అభిమానాలు మాత్రం సంతోషిస్తున్నారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఇద్దరూ కలిసి టిడిపి సంస్థాగత బలోపేతానికి కృషి చేసిన వారిలో ఉన్నారు. తదనంతర పరిస్థితుల్లో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఇద్దరూ అప్పటి నుంచి మాట్లాడుకునే వారు కాదు. రాజకీయంగా కూడా వేరే దారులు వెతుకున్నారు. ఈ నేపధ్యంలో, ఇన్నేళ్ళ తరువాత, చంద్రబాబు, దగ్గుబాటి నవ్వుతూ మాట్లాడుకున్న ఫోటోలు బయటకు రావటంతో, అందరూ సంతోషిస్తున్నారు. ఏది ఏమైనా చివరకు కుటుంబం అంతా ఒకటి అవుతుంది, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ ఆనందం తాత్కాలికమే అని మరోసారి రుజువు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read