కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వచ్చిన వరదలు, అక్కడ ప్రజల జీవితాలను తారు మారు చేసాయి. మరీ ముఖ్యంగా కడపలో, అన్నమ్మయ్య డ్యాం కొట్టుకుని పోయి జరిగిన ప్రమాదం, అంతా ఇంతా కాదు. అయితే జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉంటూ, అక్కడకు వెళ్ళకుండా, పెళ్లిళ్లకు వెళ్ళటం పైన, విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు సమాధానం ఇస్తూ, తాను అక్కడకు వస్తే అధికారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, వెళ్లలేదని ఆయన అసెంబ్లీలో చెప్పారు. తరువాత వారం రోజులకు అక్కడకు వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి, ఒక మహిళతో మాట్లాడుతూ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, తమ నిర్ల్యక్షంతోనే, ఇంత వరకు తెచ్చుకున్నాం అని చెప్పటం ఆశ్చర్య పరుస్తుంది. సహజంగా బాధితులు, ఎక్కువ పరిహారం అడుగుతారు, లేదా ఇంకా ఏమైనా సహాయం అడుగుతారు. ఇక్కడ మాత్రం, అసలు మాకు అంతా అద్భుతంగా ఉంది, తప్పు అంతా మాదే అని ఆమె చెప్పటం పై, సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తూ, రకరకాల పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇంతకూ,ఆమె ఏమన్నారు అంటే, "మాకు ముందుగానే, వరదలు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది, సచివాలయం నుంచి. అలాగే ఎమ్మెల్యే గారి నుంచి కూడా ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అన్నా. మా నిర్ల్యక్షం వల్ల, ఈ నీరు రాదులే, వరద రాదులే అని, మేము కొంచెం నిర్ల్యక్షంగా ఉన్నాం అన్నా. "
"కానీ పెద్దోళ్ళు చెప్పిన దాని ప్రకరం ఏంటి అంటే, నీళ్ళు అయితే రావులే మనకి, ఇక్కడే ఉంటున్నాం కదా, కొన్నేళ్ళ పాటు ఇక్కడే ఉంటున్నాం కదా, రావులే రావులే అనుకుని, ఇక్కడే ఉండి పోయాం. కానీ కరెక్ట్ గా 12, ఒంటి గంట సమయానికి నీళ్ళు వచ్చేసాయి అన్నా. అప్పుడు మాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. పిల్లలను తీసుకుని, మెట్ట ఉన్న ఇన్నాళ్ళకు వెళ్ళిపోయాం. అక్కడ మూడు రోజులు ఉన్నాం. అక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఏ లోటు రాకుండా మాకు, బియ్యం, సరుకులు, నూనే, ఇవన్నీ అక్కడ మాకు ఇచ్చి, ఇంటికి పంపించి, ఇంటికి వచ్చే సరికి మాకు శుభ్రంగా వాటర్ తో కడిగి ఇచ్చారు. అలాగే రెండు వేల రూపాయాలు కూడా ఇచ్చారు. 25 కేజీల బియ్యం ఇచ్చారు. కందిపప్పు, ఉల్లిగడ్డలు అన్నీ ఇచ్చారు మాకు. మా అమ్మగారికి గొర్రెలు కొట్టుకు పొతే, గంటల్లోనే డబ్బులు ఇచ్చారు మాకు. అసలు ఎమ్మెల్యే గారికి, మీకు, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత జరిగినా, ఎమర్జెన్సీగా, ఫాస్ట్ గా, జరుగుతుందని మేము కలలో కూడా ఊహించలేదు. " అని ఆమె అన్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/ef_UBuux7Aw