ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వం చేసే పనులతో, ఎప్పుడూ ఏదో ఒక రగడ ఉండాల్సిందే. మొన్నటి దాకా, దారుణమైన రోడ్డులు, చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు చార్జీలు, హెరాయిన్, ఇలా రకరకాల సమస్యలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇంటి పైకి, టిడిపి ఆఫీస్ పైకి, చివరకు చంద్రబాబు సతీమణి పై బూతులు వరకు, ఇలా రాష్ట్ర రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని మరో అంశం కుదిపేస్తుంది. అదే వన్ టైం సెటిల్మెంట్. రాష్ట్ర ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాన్ని కూడా ఊపెస్తున్న అంశం ఇది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, వాలంటీర్లు, ఇతర అధికారులు, అందరూ వెళ్లి గ్రామాల్లో వన్ టైం సెటిల్మెంట్ కింద పది వేలు కట్టాలని, దానికి అవగాహన కలిగిస్తున్నారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అసలు ఎప్పుడో, 1983 నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇచ్చిన ఇళ్ళను, ఇప్పుడు వీళ్ళు పది వేలు అడగటం ఏమిటి అంటూ, ఎవరినీ డబ్బులు కట్టొద్దు అంటూ టిడిపి ఇప్పటికే ప్రకటించింది. అయితే గ్రామాల్లోకి వెళ్తున్న వాలంటీర్లకు, సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజలు అందరూ ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికే ఆర్దికంగా చితికి పొతే, ఇప్పుడు మీరు వచ్చి పది వేలు కట్టమంటే ఎలా అంటూ, ఎదురు తిరుగుతున్నారు.

cbn 05122021 2

అనేక పన్నులు కడుతున్నాం అని, ఇప్పుడు మళ్ళీ ఇది ఏమిటి అంటూ ఎదురు తిరుగుతున్నారు. మొత్తం గందరగోళం అవ్వటం, డబ్బులు అత్యవసరం అవ్వటంతో, ఎలాగైనా ప్రజల నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలని భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరింత అవగాహన కల్పించే విధంగా, ఈ రోజు పేపర్ యాడ్ ఇచ్చారు. ఇందులో, ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీం చాలా ఉపయోగం అని చెప్తూ, గతంలో చంద్రబాబు హాయాంలో, అయుదు సార్లు అధికారులు చంద్రబాబు ముందు ఈ ప్రతిపాదన పెట్టినా చంద్రబాబు వద్దు అన్నారు అంటూ, అంత పెద్ద యాడ్ లో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి వేసారు. అయితే ఇక్కడ అర్ధం కాని విషయం, ఇప్పటికీ చంద్రబాబు అదే కదా చెప్తుంది. ప్రజల మీద భారం పడుతుంది, అయినా ఎవరో ఇచ్చిన స్థలాలకు మనం డబ్బులు తీసుకోవటం ఏమిటి అనేది చంద్రబాబు స్టాండ్. అప్పుడు కూడా అందుకే అయుదు సార్లు ప్రతిపాదిస్తే, ప్రజల మీద భారం వద్దని చంద్రబాబు వద్దు అన్నారు. ఇదే విషయం కోట్లు ఖర్చు పెట్టి, ప్రభుత్వం ఈ రోజు పేపర్ యాడ్ ఇవ్వటం హైలైట్ అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read