ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ అనే పధకం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒక పక్క ప్రభుత్వం, ఇది ఆప్షనల్ అని చెప్తూనే, మరో పక్క టార్గెట్ లు పెట్టి మరీ వసూళ్ళు చేయమని అధికారులు చెప్పటం, గందరగోళానికి గురి చేస్తుంది. ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు ఎవరూ కట్టటానికి సుముఖంగా లేమని, వాలంటీర్ల పై అరుస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడుగా తెలుగుదేశం పార్టీ కూడా ఒత్తిడి తెస్తుంది. ఆందోళనలు చేయటం, ప్రజలు మద్దతు పలకటంతో, అధికార పార్టీ డిఫెన్స్ లో పడినా, వన్ టైం సెటిల్మెంట్ మాత్రం చేసి తీరుతాం అంటుంది. తాజాగా మర్రిపాడు ఎంపీడీవో ఆడియో వైరల్ అవుతుంది. అందులో మర్రిపాడు ఎంపీడీవో మాట్లాడుతూ, సచివాలయ సిబ్బందికి టార్గెట్ లు ఇస్తున్నారు. ప్రతి రోజు టార్గెట్ లు ఉంటాయని, ఎలాగైనా ప్రజలను ఒప్పించాలని చెప్తున్నారు. అవసరం అయితే వారిని భయపెట్టాలని, కూడా చెప్పటం సంచలనంగా మారింది. ఇది కలక్టర్ ఆదేశాలు అని కూడా ఆమె చెప్తుంది. ఇప్పటికే పధకాలు ఆపేస్తాం అంటూ, ఇచ్చిన ఆదేశాలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కడితేనే, మీకు ఏ సర్టిఫికెట్లు కావాలన్నా ఇస్తాం అంటూ బెదిరిస్తున్న ఆడియో వైరల్ అవుతుంది.

jagan 06122021 2

1983 నుంచి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, పేదలకు ఇచ్చిన స్థలాలకు పది వేలు కట్టాలని ప్రభుత్వం అంటుంది. అలా చేస్తే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం అని, అవి మీరు తీసుకుని బ్యాంకులో అప్పు కూడా తీసుకోవచ్చని చెప్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు, మీకు ఎందుకు డబ్బులు కట్టాలని వాదిస్తుంది. ఉచితంగా ఇవ్వాలని, లేదంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత, ఫ్రీ గా ఇస్తాం అని అంటుంది. అయితే ప్రజలు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క ఆప్షనల్ అని చెప్తూనే, ఇలా బలవంతం చేయటం పై, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ధరలు పెరిగి, ఏమి చేయాలో అర్ధం కాక, మేము ఉంటే, ఇప్పుడు పది వేలు ఎక్కడ నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇంటి అద్దె పెంచారని, చెత్త పన్ను వేస్తున్నారని, కరెంటు చార్జీలు పెరిగాయని, పెట్రోల్, చర్జలు పెరిగాయని, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అని, ఇప్పుడు ఈ గుదిబండ మా వల్ల కాదని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read