నాయకులెవరైనా కష్టపడి, నిజాయితీగా పనిచేస్తేనే పార్టీలో సముచిత స్ధానం ఉంటుందని, అలసత్వం వహిస్తే ఎంతటి నేతలనైనా ఉపేక్షించేదిలేదని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుగొండలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాకపోవటంపై జిల్లా నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నాయకుల మద్య సమన్వయ లోపం, అలసత్వం వల్లే పెనుగొండ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిందని ఇక నుంచి నాయకులంతా కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడి చేయాలని,‎ పార్టీ కార్యక్రమాల పట్ల అలసత్వం వహిస్తే ఎంతటి నేతలనైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఫలితాలపై నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. నాయకులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారికి అండగా నిలిచిన నాయకుల్నే ప్రజలు ఆదరిస్తారని, నాయకులంతా నిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ దుర్మార్గాలను ఎండగడుతూ బాధితుల పక్షాన నిలవాలని అన్నారు.

atp 04122021 2

టీడీపీ నేతలపై అక్రమ కేసులు వైసీపీకీ తాత్కాలిక ఆనందమేనని, వైసీపీ అరాచకాలకు భయపడకుండా దైర్యంగా ఎదుర్కొని పోరాడాలన్నారు. గెలుపు ఓటములపై చంద్రబాబు అభ్యర్ధులతో చర్చించగా.. వాలంటీర్ల దౌర్జన్యాలు, వైసీపీ నేతల బెదిరింపులను చంద్రబాబు దృష్టికి తీసుకురాగా.. వైసీపీ పాలనలో ఉన్మాదం పెరిగిపోయిందని, అరాచకాలు, దౌర్జన్యాలు హద్దు మీరిపోయాయని, ఆ ఉన్మాదులను దైర్యంగా ఎదురర్కొంటునే రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది వరకు అభ్యర్ధులు గెలిచిన తర్వాత వారికి క్యాంపులు పెట్టి కాపాడే వారని, ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో నామినేషన్లు వేయటానికి కూడా క్యాంపులు పెట్టి వారిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పోటీ చేసిన వారినే కాకుండా, వారికి మద్దతు ఇచ్చే వారిని కూడా హింసిస్తున్నారు. నాయకుల గత చరిత్ర కంటే కూడా, ప్రజలలో వారికి ఉన్న ఆదరాభిమానాలే ఓట్లు పడేలా చేస్తాయని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read