ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ లో ఆక్సిజన్ ప్లాంట్లుకు సంబంధించి, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేసారు. ఆ తరువాత, కో-వి-డ్ పై సమీక్ష నిర్వహించారు. కో-వి-డ్ టాస్క్ ఫోర్సు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ పై, భేటీ నిర్వహిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11  నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ ఉండనుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి మించి పోగావ్వకుండా, అలాగే లోపల ఇంటర్నల్ అయితే, వంద మందికి మించకుండా ఆంక్షలు విధించారు. ఇక సినిమా వాళ్ళకు కూడా షాక్ ఇచ్చారు. ఇక నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమా ధియేటర్లు రన్ అవుతాయి. అలాగే మాల్స్ లో కూడా, 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంటుంది. అలాగే మాస్క్ కూడా తప్పనిసరి చేసారు. దీనికి సంబంధించి, త్వరలోనే పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read