ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఆర్సీ ప్రకటించటంతో బిగ్ షాక్ తగిలింది. నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో వివిధ గ్రామా, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సుమారు లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వీళ్ళంతా కూడా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయత్ అధికారి అధ్వర్యంలో నడిచే వాట్స్ అప్ గ్రూప్ ల్లో నుంచి పెద్ద ఎత్తున ఎగ్జిట్ అవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఎవరికి సందేశాలు ఇవ్వాలి, ఎవరికి పని చెప్పాలో అర్ధం కాక, తీవ్ర అయోమయం నెలకొంది. పైగా, అన్ని జిల్లాల్లో కూడా ఈ వార్డు, గ్రామ సెక్రటరీలు, అధికారిక గ్రూప్ ల నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. అడ్మిన్ ల దగ్గర నుంచి కూడా, ఈ గ్రూపుల్లో ఎగ్జిట్ కావటంతో, నిన్న ఉదయం నుంచి కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. దీంతో పాటు, వీళ్ళు అంతా కూడా గత ఏడాది ఆగష్టు లో తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్నారని చెప్పారని, అయితే నేటి వరకు కూడా చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున కూడా, గత ఏడాది అక్టోబర్ రెండున కానీ, వీళ్ళకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అయితే మొన్న జగన్ పుట్టిన రోజున ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవటంతో, అప్పట్లో ఆందోళన చేయగా, పీఆర్సీ రోజు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
అయితే నిన్న పీఆర్సీ ప్రకటనలో కూడా, ఈ ఏడాది జూన్ వరకు, కూడా ప్రొబేషన్ డిక్లేర్ ని వాయిదా వేయటంతో, ఒక్కసారిగా వీళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా, అధికారిక వాట్స్ అప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర అయోమయం నెలకొంది. దీని పై వెంటనే గ్రామ వార్డు సచివాలయాల సెక్రటరీగా పని చేసే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు, అదే విధంగా జాయింట్ కలెక్టర్లకు కూడా వాట్స్ అప్ మెసేజ్ లు పంపిస్తూ, వెంటనే వారితో మాట్లాడాలని, వారికి ఏమైనా సమస్య ఉంటే, ప్రభుత్వంతో మాట్లాడాలి కానీ, ఈ విధంగా గ్రూప్ ల నుంచి బయటకు వెళ్తే, అధికారిక కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారని, ఆయన ప్రశ్నించారు. వెంటనే వారి అందరితో మాట్లాడాలని, లేని పక్షంలో, ప్రభుత్వ విధులను బహిష్కరిస్తే, వారి పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, చెప్పాలని చెప్పారు. అయినా ఎవరూ కూడా లెక్క చేయటం లేదు.