అమరావతి.. ఈ మాట వింటే పులకించని తెలుగు వారు ఉండరు. చరిత్రలో అమరావతికి ఉన్న వైభవం, ఆధునిక కాలంలో అమరావతి కోసం ఆంధ్రుడు పడిన తపన, అమరావతికి ఆ స్థానం ఇచ్చాయి. కానీ ఒక మంచి పనికి రాక్షసులు అడ్డు పడినట్టు, దీనికి కూడా వైసీపీ శ్రేణులు అడ్డు పడ్డారు. అమరావతి అంటే ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. ఎందుకు అలా ఉంటారో, ఎందుకు అంత ద్వేషమో వారికే తెలియాలి. అమరావతిని ఎన్ని రకాలుగా అవమానించాలో, నష్టపరచాలో, నిర్వీర్యం చేయాలో, అన్నీ చేసారు. అయినా అమరావతి అలాగే ఠీవిగా నిలబడింది. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి పూర్తి మద్దతు తెలిపారు జగన్ మోహన్ రెడ్డి. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటా, చంద్రబాబు కంటే అద్భుతమైన రాజధాని కడతాను అన్నారు. ప్రజలు నమ్మారు. చంద్రబాబుని వద్దు అనుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. ఇంకేముంది అమరావతి , సింగపూర్ కాదు అమరావతి అవుతుందని అనుకున్నారు. కానీ అసలు అమరావతే లేకుండా చేసారు. ఇంకా చెప్పాలి అంటే, అసలు రాజధాని లేకుండా చేసారు. అమరావతిని ఎడారి అన్నారు. అమరావతిని స్మశానం అన్నారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అన్నారు. అమరావతి ఒకక్ కులం అన్నారు.
అన్నిటికంటే మించి అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. అక్కడ బిల్డింగ్లు ఏమి లేవని, మొత్తం గ్రాఫిక్స్ అని ప్రచారం చేసారు. చివరకు కోర్టుల జోక్యంతో, మడమ తిప్పి, మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు. ఇప్పుడు అప్పులు పుట్టటం లేదు కాబట్టి, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ప్లాట్లు వేసి ప్రభుత్వం అమ్మకం మొదలు పెట్టింది. మంగళగిరిలో కూడా ఈ ప్లాట్లు వేసింది ప్రభుత్వం. జగన్ మోహన్ రెడ్డి ఫోటోతో, ప్లాట్లు కొనుక్కోండి అని చెప్తూ, అక్కడ ఉన్న అడ్వాంటేజస్ చెప్తూ, అమరావతిలో సచివాలయం ఉంది, అమరావతిలో హైకోర్టు ఉంది, అమరావతిలో APIIC హెడ్ క్వార్టర్స్ ఉంది, SRM యూనివర్సిటీ ఉండి, అమృతా యూనివర్సిటీ ఉంది అంటూ, చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు బకరాలు అయ్యారు. ఒక పక్క ఇప్పటి దాకా గ్రాఫిక్స్ అంటుంటే, కాదు బిల్డింగ్ లు చంద్రబాబు కట్టడాని మనమే చెప్పటం ఏమిటి ? ఒక పక్క చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేసాడని మనమే చెప్పి, ఇప్పుడు మళ్ళీ మనమే రియల్ ఎస్టేట్ చేయటం ఏమిటి అంటూ, తలలు పట్టుకుంటున్నాయి.