తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా కక్ష తీరినట్టు లేదు. సంగం డెయిరీ విషయంలో నేరాలు, ఘోరాలు జరిగిపోయాయని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు కోర్టు ముందు ఒక్క సాక్ష్యం కూడా చూపించ లేక పోయారు. అన్ని కక్ష సాధింపు కేసుల్లో లాగానే, ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు మరోసారి ధూళిపాళ్ల నరేంద్రను ప్రభుత్వం టార్గెట్ చేసింది. మరోసారి ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విషయం ఏమిటి అంటే, ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్‌ ట్రస్ట్‌ అనే ట్రస్ట్ ని రిజిస్టర్ చేసుకోలేదని, ఇది దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని సెక్షన్‌ 43 ప్రకారం విరుద్ధం అంటూ నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోలేక పొతే, చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ట్రస్ట్ కి సంబంధించిన అన్ని కాగితాలు కూడా తమ ముందు ఉంచాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు దీని పై తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read