గత 40 ఏళ్ళుగా ఎన్నో రాజకీయ పార్టీలను, నేతలను ఎదుర్కుని, డీ కొట్టి రాజకీయాలు చేసి, నిలిచిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం తన రాజకీయ శైలిని మార్చుకునే పనిలో పడింది. అవతల వాళ్ళు రాజకీయం చేయకుండా, రౌడీజం చేస్తున్న ఈ తరుణంలో, ఇక నుంచి తాము కూడా గేర్ మార్చాలని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయ్యింది. సంప్రాదాయ రాజకీయాలు చేస్తుంటే, ప్రత్యర్ధికే కాదు, ప్రజలకు కూడా దూరం అవుతున్నాం అని గుర్తించిన తెలుగుదేశం పార్టీ, గేర్ మార్చింది. నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, త్వరలో జరగబోయే 22 మునిసిపాలిటీల నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ఇక మన రాష్ట్రంలో సాంప్రదాయ రాజకీయాలు నడవవు అని, ఢీ అంటే ఢీ అనే వారే కావాలని, అందుకే మనం కూడా అలాగే మారదాం అని, రేపు అభ్యర్ధులను కూడా అలాంటి వారినే పెడుతున్నాం అని చంద్రబాబు అన్నారు. రేపు జరిగే 22 మునిసిపాలిటీలలో ఎక్క్కాద్ నామినేషన్లలో తేడా కొట్టినా, అక్కడ ఆన్న ముఖ్య నేతలదే బాధ్యత అంటూ చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ఇది ఒక్కటే కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్న వారి పైన కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.
అధికారంలో ఉన్నప్పుడు, కొంత మంది నేతలు, పార్టీ గురించి ఆలోచించ కుండా, పార్టీ కోసం మంచి చేసిన కార్యకర్తలను ప్రోత్సహించకుండా, వారికి ఇష్టమైన వారికి పదవులు, ఇతర లబ్ది చేకుర్చారని, ఇప్పుడు మనకు అధికరం పోగానే, వారు ప్రత్యర్ధుల పార్టీలోకి వెళ్ళిపోయి పబ్బం గడుపుతుంటే, మా కార్యకర్తల మాత్రం మనల్నే అంటి పెట్టుకుని ఉన్నారని అన్నారు. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగవు అని, ఇవన్నీ గుర్తు పెట్టుకుని, ముందుకు వెళ్తానని చంద్రబాబు అన్నారు. రేపు జరగబోయే 22 మునిసిపాలిటీల ఎన్నికలు తమకు సంబంధం లేదు, తాము పోటీలో లేము కదా అని నేతలు అనుకుంటే కుదరదు అని అన్నారు. ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, గట్టి పోటీ ఇచ్చి, విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. ముఖ్యంగా ఓట్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతుందని, ఓట్లు తొలగించకుండా, దొంగ ఓట్ల నమోదు చేయకుండా, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మొత్తం బాధ్యత ముఖ్య నేతలదే అని స్పష్టం చేసారు.