ఇటీవల కాలంలో కాపు కులంలోని ప్రముఖులు అందరూ హైదరాబాద్ వెళ్లి, అక్కడ సమావేశం అయ్యి, కాపు కులం నుంచే ముఖ్యమంత్రి కావాలని, దీనికి ఏమి చేయాలి అంటూ, సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. టిడిపి నుంచి గంటా, బీజేపీ నంచి కాన్నా లక్ష్మీ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఇలా ప్రముఖ కాపు నేతలు అందరూ కలిసి సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో జనసేన నుంచి ఎవరూ వెళ్ళలేదు. అయితే ఈ కాపు ప్రముఖల మీటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు, కాపు సంక్షేమ సేన ఫౌండర్ చేగొండి హరిరామ జోగయ్య. అక్కడ సమావేశం అయిన కాపుల్లో జేడీ లక్ష్మీ నారయణ లాంటి నేతలు తప్ప, అసలు ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకులే లేరని హరిరామ జోగయ్య అన్నారు. అక్కడ సమావేశం అయిన వారిలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి, నడిపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ఇక్కడ సమావేశం అయిన వారిని చూస్తూ, వీరు కనుక రాజకీయ పార్టీ పెడితే, ఓట్లు చీల్చి, ఒక పార్టీకి ఉపయోగ పడటం తప్ప, వీళ్ళు చేసే రాజకీయంతో, ఎక్కడా కాపులకు రాజ్యాధికారం వచ్చే అవకసామే లేదని, అక్కడ ఉన్న నేతలు ఎవరికీ కూడా, ఒక పార్టీ పెట్టి, నడిపి, ముందుకు తీసుకుని వెళ్ళేంత శక్తి ఎవరికీ లేదని హరిరామ జోగయ్య అన్నారు.
అయితే అక్కడ సమావేశం అయిన నేతలకు చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇందుకు పనికి రారు అనే విధంగా వారి వాదన ఉందని, అది తప్పు అని అన్నారు. కాపు కులస్తులలో పార్టీ నడుపుతుంది, ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆయన అన్నారు. కులాల ఐక్యతతో పాటు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి పవన్ కళ్యాణ్ నినాదాలని అన్నారు. అయితే కాపులకు, బీసీలు, మైనారిటీలు తోడు అయితే, కాపులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందని అన్నారు. ఎవరికి వారు పార్టీ పెట్టుకుంటే, ఓట్లు చీల్చుకుంటానికి ఉపయోగ పడుతుంది కానీ, కాపులకు రాజ్యాధికారం అయితే రాదు అని అన్నారు. ఇక్కడ సమావేశం అయిన వారి ఆలోచన చూస్తే, కాపుల ఓట్లు చీల్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకురాలి అనే విధంగా ఉందని అన్నారు. కాపుల ఓట్లు చీల్చటానికి వైసీపీ ఆడిన వ్యూహంలో భాగంగానే వీళ్ళు ఈ ఆట ఆడుతున్నారని హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలు పన్నే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ చేస్తున్నారని అన్నారు.