హిందూపురం ఎమ్మెల్యే ,హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి దగ్గర కొంత సేపటి క్రితం వైసిపి, టిడిపి కార్యకర్తల నినాదాలతో ఉద్ద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. డంపింగ్ యార్డు వివాదంతో ఇరువర్గాలు బహిరంగంగా సవాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఇరు వర్గాలు సవాళ్ళు ,ప్రతి సవాళ్ళు విసురుకోవడంతో ఈ వివాదం ముదిరింది. నందమూరి బాలకృష్ణ ఇల్లు చౌడేస్వరం కాలనీలో ఉంటుంది. ఆ కాలనీ వెనుకు వైపు మోత్కుపల్లిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసారు. ఆ
డంపింగ్ యార్డు దగ్గర వ్యర్ధలన్నింటిని కుడా కాల్చివేయడంతో ఆ ప్రాంతం అంత కూడా దుర్వాసన రావడంతో పాటు పొగ చుట్టూ కుంటోంది. ఈ డంపింగ్ యార్డ్ కారణంగానే ఈ ప్రాంతం అంత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నరంటూ టిడిపి కి చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టటం జరిగింది. దీనికి ప్రతి సవాలుగా వైసిపికి సంబంధించి వారు కూడా అభివృది పై తాము చర్చకు సిద్దంగా ఉన్నామని, రెండు సంవత్సరాలుగా తాము ఏమి అభివృది చేశామనే దాని పైన పోస్ట్ పెట్టారు. దీనితో ఇరువర్గాల మధ్య సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టుకుంటూ వివాదం ఏర్పడింది. దీని పైన ఈ రోజు చర్చకు సిద్దమంటూ చెప్పారు. అందులో బాగంగానే వైసిపి శ్రేణులు పదుల సంఖ్యలో బాలకృష్ణ ఇంటికి వచ్చి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వైపు టిడిపి కార్యకర్తలు కూడా ఒక్కసారిగా బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చిఇరు వర్గాలను చెదరగొట్టారు.
హిందూపురంలో ఉద్రిక్తత... బాలయ్య ఇంటి ముట్టడికి వచ్చిన వైసీపీ శ్రేణులు...
Advertisements