తూర్పు గోదావరి జిల్లాలో ఓటిస్ కు సంభందించి చివరకు వైసిపి నేతలు కూడా ప్రజలను ఎక్కడికక్కడ బెదిరిస్తున్నారు. మీరు ప్రభుత్వం చెప్పిన 10వేలు గాని, 20 వేలు గాని,15 వేల రూపాయల్లో ఏదైతో మీకు వర్తిస్తుందో అది కట్టక పోతే ,మీ ప్రభుత్వ పధకాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తుండగా, తాజాగా కొంతమంది వాలంటీర్లు,వైసిపి నేతలు కలిసి గ్రామాల్లోని, పట్టణాల్లోని ఇంటింటికి తిరిగి మీరు జగనన్న ఉప్పు తింటున్నారు,అ జగనన్నఉప్పు తింటున్నప్పుడు , జగనన్న ప్రవేశ పెట్టిన పధకాలకు మీరెందుకు డబ్బులు కట్టరని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించే పరిస్తితి చూస్తుంటే వాళ్ళు ఎంత దిగాజారిపోయరో అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ నియోజక వర్గంలో లబ్దిదారులను ఎక్కడికక్కడ బెదిరిస్తుంన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఓటిస్ అత్యధిక వసూళ్ళు తూర్పు గోదావరి జిల్లాలో జరగాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 30 శాతం లోపు కూడా లక్ష్య సాధన జరగలేదని, ఈ నేపధ్యంలో జిల్లాల కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ వరకు ఎక్కడికక్కడ RTO కి MRO కి వీళ్ళందరికీ MDO కి టార్గెట్ లు ఇచ్చి డబ్బులు ఎట్టి పరిస్తితుల్లో కట్టి తీరాలని మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్నారు. మరో పక్క కొంత మందైతే వాలంటీర్లకు వసూలు చేయకపోవటం తో షోకాజ్ నోటిసులు కూడా జారి చేసినట్టు తెలుస్తుంది.

ots 27122021 2

ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ వీరందరూ కూడా బెదిరిస్తున్నారు. మీరు డబ్బులు కట్టకపోతే పధకాలు అన్నీ రద్దు చేస్తాం అని బెదిరిస్తున్నారు. భవిషత్తు జగనన్న పదకాలు అందాలంటే ఇప్పుడు మీరు డబ్బులు కట్టి తీరాల్సిందేనని బెదిరిసున్నారు. మరో పక్క తెలుగు దేశం పార్టీ ఈ రోజు ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దేనిని లెక్క చేయటం లేదు. మరో పక్క స్వచందమేనని ప్రభుత్వం ఓటిస్ గురించి చెబుతుండగా, జగన్ ఇటీవల పచ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సభలో ఓటిస్ ఉగాది వరకు కొనసాగుతుందని చెప్పారో, అప్పటినుంచి కూడా అధికారులు, వాలంటీర్లు , వైసిపి నేతలు కలిసి డబ్బులు వసూల్ చేసే పనిలో పడ్డారని చెప్పొచ్చు. దాదాపు పంచాయితీలో అయితే 10 వేలు, మున్సిపాలిటీలో అయితే 15 వేలు కార్పోరేషన్ పరిధిలో అయితే 20 వేలు వరకు వసూలు చేస్తున్నారు. మరో పక్క తాము డబ్బులు కట్టలేమని ఉపాధి పోయి రోడ్డున పడ్డామని అనేక మంది భాదితులు సెల్ఫి విడియో తీసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read