వైస్ వివేకా హ-త్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సిబిఐ కీలక నిందితుడిగా భావిస్తుంది. ఆయన్ను అదుపులోకి తీసుకున్న సిబిఐ, కోర్టు ఆదేశాలు ప్రకారం రిమాండ్ కు తరలించింది. కడప సెంట్రల్ జైలుకి పంపిన తరువాత ఎక్కువ శాతం కడప రిమ్స్ హాస్పిటల్లోనే గడిపినట్టు అర్ధం అవుతుంది. ఈ విషయం బెయిలు పిటీషన్ రద్దు చేసేటప్పుడు మేజిస్ట్రేట్ కు, సిబిఐ ఈ పాయింట్ కూడా యాడ్ చేసి తమ వాదనలు వినిపించింది. అయితే అప్పట్లోనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసులో ప్రధాన నిందితుడుని కోర్ట్ అనుమతి లేకుండా రిమ్స్ కు ఎలా తరలిస్తారని, అనారోగ్య కారణాలు ఏమైనా ఉంటే రూల్స్ ప్రకారం జైలు సూపరేండెంట్ ద్వారా వెళ్ళాలని, అన్నిటి కంటే ముందు కోర్ట్ అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. అయితే ఎవరి అనుమతి తీసుకోలేదని సిబిఐ ఆ పాయింట్ ను కోర్టుకు, చెప్పగా మేజిస్ట్రేట్ దాని మీద ప్రశ్నించారు. మొన్న బెయిలు పిటీషన్ రద్దు అయినప్పుడు కూడా కోర్ట్ అనుమతి లేనిదే ఎక్కడికీ వెల్లకూడదని చెప్పటం జరిగింది. మళ్ళీ ఆయన్ను రిమ్స్ కు తీసుకుని వెళ్ళారు. మరో వైపు రిమ్స్ అధికారులు శంకర్ రెడ్డికి మరో ఆపరేషన్ అవసరం అవుతుందని చెప్తున్నారు. ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నప్పుడు ఒక సర్జరీ జరిగిందని ఆయన వర్గీయులు చెప్తున్నారు.
ఆ తరువాత సిబిఐ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, పదే పదే అనారోగ్య కారణాలు చెబుతూ తరచూ రిమ్స్ లో జాయిన్ అవ్వటం చేస్తున్నారు. అంత కీలక నిందితుడు కోర్ట్ అనుమతి లేకుండా పదేపదే రిమ్స్ లో పోలీసులు ఎలా పెడతారని కూడా సిబిఐ అభ్యంతరం చెప్పటం జరిగింది. మరో వైపు రిమ్స్ అధికారులు శంకర్ రెడ్డికి మరో ఆపరేషన్ అవసరం అవుతుందని చెప్పారు. ఆర్థ్రో కు సంభంధించే కాకుండా మరో ఆపరేషన్ అవసరం అవుతుందని రిమ్స్ వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు సర్జరీ చెయలన్నా కూడా కోర్ట్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సిందే. అయితే జైలు సూపరిడెంట్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు శంకర్ రెడ్డి కోర్ట్ అనిమతి తీసుకున్నారని ఆయన్ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రోజే కోర్టు ముందు హాజరు పరుస్తామని, పులివెందుల కోర్ట్ లో మేజిస్ట్రేట్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారని చెప్పటం జరిగింది. అయితే అసలు సర్జరీకి కోర్ట్ అనుమతి ఇంచ్చిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ సర్జరీ చేస్తే మళ్ళి రెస్ట్ కోసం అంటూ ఇంకొన్ని రోజులు హాస్పటల్ లో ఉండాల్సి వస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పై, ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.