తమిళనాడు సియం స్టాలిన్ చేస్తున్న పనిని తెలుగుదేశం పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో వీపరీతంగా పొగిడేస్తున్నారు. స్టాలిన్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనే ఇప్పుడు స్టాలిన్ కూడా చేయడంతో తమ అధినేత చేసిన పని అందరికి స్ఫూర్తిదాయకం అని తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్ లో ఉన్నారు. ఎందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని తెలుగుదేశం శ్రేణులు పొగుడుతున్నరంటారా? ఎందుకంటే ఈ మధ్యే తమిళనాడు సియం స్టాలిన్ సీఎం డాష్ బోర్డ్ ను స్టార్ట్ చేసారు. తమ ప్రభుత్వం పాలనలోని ముఖ్యమైన విషయాలను తనే స్వయంగ సమీక్షిస్తారని తెలిపారు. తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సీఎం డాష్ బోర్డును మొదలు పెట్టి ఎంతో పారదర్శకమైన పాలన అందించారో తెలిసిందే. చంద్రబాబు పాలన అందరి ముఖ్య మంత్రులకు ఆదర్శమని, అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా ఇది ఇంప్లెమెంట్ చేయాలి అంటూ, రాష్ట్రపతి కూడా కొనియాడారు. చంద్రబాబు స్పూర్తితితో మరికొన్ని రాష్ట్రాలు కూడా డాష్ బోర్డును మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్నో రాష్ట్రాలు మా చంద్ర బాబు చేసిన పనిని స్పూర్తిదాయకంగా తీసుకుంటుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అమలులో ఉన్న డ్యాష్ బోర్డు ని పక్కన పడేశారని వాపోతున్నారు.
చంద్రబాబు సియంగా ఉండగా తెచ్చిన కీలక వ్యవస్థ, జగన్ వదిలేసినా, స్టాలిన్ మాత్రం తీసుకున్నారు..
Advertisements