నర్సాపురం వైసిపి ఎంపీ రఘురామ కృష్ణరాజు, మరో వైసిపి ఎంపీపై ఫిర్యాదు చేస్తూ  ప్రధాన మంత్రి మోడి కి లేఖ రాసారు. ఎంపీ మాధవ్ తనను హ-త్య చేస్తానంటూ బెదిరించారని, పార్లమెంట్  నాలుగో గేటు దగ్గర నుంచుని  తన పైన తీవ్రమైన దూషణలకు పాల్పడ్డారని రఘురామ కృష్ణరాజు ఈనెల 8న ప్రదానికే కాకుండా పార్లమెంట్ స్పీకర్ కు, కేంద్ర హెం మంత్రికి కూడా  లేఖలు రాసారు. తన పైన నీచమైన దూషనలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఇదివరకు కూడా సెంట్రల్‌ హాల్‌లో ఎంపీ మాధవ్‌  తనను బెదిరించారని, ఈ విషయం తాను  ప్రివిలేజ్‌ కమిటీకి కంప్లైంట్ ఇచ్చానని రఘురామ కృష్ణరాజు తెలిపారు. సురేష్ కూడా పార్లమెంటులో' చాల అసభ్యంగా మాట్లాడి , ఇప్పుడు తానూ అసలు అట్లా మాట్లాడలేదని మాట మారుస్తున్నారని కూడా రఘురామ కృష్ణరాజు వాపోయారు. ఇంతటి ధైర్యం లేని పిరిపి పందలు తిట్టడం దేనికి, మళ్ళి మేమేమి మాట్లాడలేదని అబద్దాలు చెప్పడం దేనికని' ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటుగా విమర్శించారు. అయితే తాజాగా  రఘురామ కృష్ణ రాజు రాసిన లేఖకు కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. తనకు లేఖ అందిందని అమిత్ షా తిరిగి ప్రత్యుత్తరం రాసారుని, తగు చర్యలు ఉంటాయని రఘురామ కృష్ణరాజు మీడియాకు తెలియ చేసారు. తరువాత ఎం జరుగుతుందో చూడాలి. 

Advertisements

Advertisements

Latest Articles

Most Read