ఆంద్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణ ఈ రోజు హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం ముందు జరిగింది. ఈ విచారణ జనవరి 28 తేదికి వాయిదా పడటం జరిగింది.అయితే మూడు రాజధానుల కేసు విచారణ సందర్భంగా పిటీషనర్ల తరుపున ఎవరైతే అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో, ఆ రైతుల తరుపున సుప్రీం కోర్ట్ న్యాయవాది శ్యాం దివాన్, అదే విదంగా సీనియర్ హైకోర్ట్ న్యాయవాదులు జంధ్యాల రవి శంకర్, ఉన్నవ మురళీధర్ వీళ్ళంతా కుడా వాదన వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పిటీషన్ల పై విచారణ కొనసాగాల్సిందేనని చెప్పి శ్యాం దివాన్ వాదించటంతో పాటు అమరావతి నిర్మాణం కోసం ఏదైతే మాస్టర్ ప్లాన్ CRDA ఆమోదించిందో ,ఆ మాస్టర్ ప్లాన్ అమలు జరపాల్సిందేనని, అదేవిధంగా ఆ మాస్టర్ ప్లాన్ అనుగునంగా రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఎట్టి పరిస్తితుల్లో కూడా అమలు చెయ్యాల్సిన్దేనని LPS కింద వాళ్ళకు ఇచ్చిన భూములను డెవెలప్ చెయ్యాల్సిందేనని స్పష్టం చేసారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నప్పటికీ కూడా ,ఏదైతే మాస్టర్ ప్లాన్ కు సంభందించి ఉన్న ఆ అంశాలు పరిష్కారం కాలేదు అని చెప్పి, అ బ్రీఫ్ నోట్ తో ఎటువంటి పని కాదు అని వాదించారు.

amaravaticase 27122021 2

పైగా ఏదైతే ఈ పిటీషన్లలో గేజెట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారో, అందరి అభిప్రాయాలూ తీసుకునేందుకు, చట్టంలో ఉండే లోపాలను సరిదిద్దేటందుకు మాత్రమే దీనిని ఉపసంహరిచుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు కాబట్టి ఈ పిటీషన్లపై విచారణ జరగాల్సిందేనని చెప్పారు. అదే విదంగా జంధ్యాల రవి శంకర్ మాత్రం సెలక్ట్ కమిటీ కి వెళ్ళకుండా బిల్లులను ఆమోదించినట్లు పేర్కొన్నారని, ఇది రాజ్యంగ పరంగా ఘోరమైన తప్పిదం అని ఆయన స్పష్టం చేసారు. ఇక ఉన్నవ మురళీధర్ మాత్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ట్రిబ్యునల్ ను కర్నూల్ కు మార్చిందని, అదే విదంగా జగన్ వెళ్లి విశాఖపట్నం కూర్చుంటే అక్కడే రాజధాని ఉంటుందని చెప్పే ప్రమాదం ఉందని కూడా అయన కూడా వాదనలు వినిపించారు. ఈ నేపధ్యంలోనే చాలా వాడి వేడి వాదనలు జరిగాయి. కేసు పూర్తి స్థాయిలో, ఈ పిటీషన్ల పై విచారణ కొనసాగాలా వద్దా అనేది, అలాగే ఒకసారి యాక్ట్ వెనక్కు తీసుకున్నాక విచారణ అవసరం ఉందా అనే అంశం పై కూడా, జనవరి 28 తేదిన నిర్ణయిస్తామని హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read